KGF 2 : కేజీఎఫ్-2 నేను చూడలేదు, చూడను కూడా.. కాంతార నటుడు!

కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతార చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. కాగా కాంతార సినిమాలో పోలీస్ పాత్ర చేసిన కిషోర్ కుమార్.. కేజీఎఫ్-2 నా తరహా సినిమా కాదు అందుకే ఇప్పటివరకు చూడలేదు అంటున్నాడు.

KGF 2 : కేజీఎఫ్-2 నేను చూడలేదు, చూడను కూడా.. కాంతార నటుడు!

kantara actor kishore didn't watch kgf2

KGF 2 : కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతార చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. రెండు భాగాలు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని ఎంతోగాను అలరించింది. 2018లో విడుదలైన చాప్టర్-1.. సెకండ్ పార్ట్ పై భారీ హైప్ ని క్రియేట్ చేయడంతో చాప్టర్-2 భారీ ఓపెనింగ్స్ అందుకోవడమే కాకుండా దాదాపు రూ.1000 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Yash : ఫ్యాన్స్‌ని కలవలేను అంటూ హీరో యష్ బహిరంగ లేఖ..

మరి ఇంతటి విజయాన్ని సాధించిన ఈ సినిమాని ఒక నటుడు ఇప్పటివరకు చూడలేదు, చూడను కూడా అని తెగిసి చెప్పేశాడు. ఆ నటుడు ఎవరంటే.. కాంతార సినిమాలో పోలీస్ పాత్ర చేసిన కిషోర్ కుమార్. ఈ యాక్టర్ కాంతార సినిమాలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ నటుడు మాట్లాడుతూ.. ‘సమాజంలోని సమస్యలు చూపించే చిన్న సినిమా అయినా చూస్తా కానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ని చూపించే పెద్ద సినిమాలను మాత్రం చూడడానికి ఇష్టపడను. నేను ఇప్పటి వరకు కేజీఎఫ్-2 సినిమా చూడలేదు. అది నా తరహా సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు.

కన్నడ నటుడు అయ్యుండి కన్నడ పరిశ్రమకి పేరు తెచ్చిపెట్టిన సినిమానే చూడలేదు, చూడను అనడం కన్నడనాట హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఇటీవల ఈ నటుడు ట్విట్టర్ అకౌంట్ తొలిగించబడింది. ఇక దీనిపై అనేక కథనాలు వార్తల్లో వస్తుండడంతో.. కిషోర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చాడు. డిసెంబర్ 20, 2022న తన అకౌంట్ హ్యాకింగ్ గురయ్యింది. దాని కారణంగానే తన ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయబడింది అని తెలియజేశాడు.