Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ సినిమా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ కన్నడ సినిమా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఇక ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు.

Kantara : తుళు లాంగ్వేజ్‌లో విడుదలకు సిద్దమవుతున్న కాంతార..

కేవలం కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకోవడంతో ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, ప్రేక్షకులు రిపీట్ మోడ్‌లో ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు ఇండియావైడ్ ఆడియెన్స్ కోసం హిందీలోనూ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతోంది. అంతేగాక, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించేందుకు ఇంగ్లీష్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోంది.

Kantara : కాంతార ఫాన్స్‌కి షాక్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్..

యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాకు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. అందుకే ఈ సినిమాను ఇంగ్లీష్ వర్షన్‌లో డబ్ చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ చేసి, హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అందించాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుంది. మరి ఈ సినిమా నిజంగానే ఇంగ్లీష్‌లో డబ్ అయ్యి హాలీవుడ్ వరకు వెళ్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.