Bigg Boss 15: బిగ్ బాస్ హోస్ట్ గా కరణ్ జోహార్.. నెటిజన్స్ ట్రోల్స్!

మన తెలుగు ప్రేక్షకుల నుండి ప్రపంచంలో ప్రతి ప్రేక్షకుడికి బాగా పరిచయమున్న షో బిగ్ బాస్. కాస్త పేరు మారినా.. ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా బాషలలో కూడా ఈ షో పార్మెట్ బాగా పాపులర్. ఇక మన దేశంలో కూడా చాలా బాషలలో ఇది హిట్ రియాలిటీ షో.

Bigg Boss 15: బిగ్ బాస్ హోస్ట్ గా కరణ్ జోహార్.. నెటిజన్స్ ట్రోల్స్!

Bigg Boss 15

Bigg Boss 15: మన తెలుగు ప్రేక్షకుల నుండి ప్రపంచంలో ప్రతి ప్రేక్షకుడికి బాగా పరిచయమున్న షో బిగ్ బాస్. కాస్త పేరు మారినా.. ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా బాషలలో కూడా ఈ షో పార్మెట్ బాగా పాపులర్. ఇక మన దేశంలో కూడా చాలా బాషలలో ఇది హిట్ రియాలిటీ షో. అందులో కూడా ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది ఇప్పటికే 14 సీజన్లు పూర్తిచేసుకొని ఇప్పుడు 15వ సీజన్ కు సిద్ధమైంది. త్వరలోనే ఈ కొత్త సీజన్ కూడా మొదలు కానుంది.

అయితే, దీనిపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. మిగతా బాషలలో ఈ షో హోస్టులుగా కొందరు మారినా హిందీలో మాత్రం ఇప్పటి వరకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక్కడే హోస్ట్ చేశాడు. అయితే, ఈసారి అక్కడి బడా చిత్రాల నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ షో హోస్ట్ చేయనున్నాడని ప్రకటించారు. అంతేకాదు ఈసారి ఈ షో బుల్లితెర మీద కాకుండా ఓటిటిలో స్ట్రీమ్ కానున్నట్టుగా తెలిపారు.

అలాగే ఈ షో ప్రీమియర్ వచ్చే ఆగష్టు 8 నుంచి మొదలు కావడానికి రెడీగా ఉండగా.. త్వరలోనే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ను కూడా ప్రకటించనున్నారు. కాగా, సల్మాన్ ను కాదని కరణ్ జోహార్ ను ఈసారి హోస్ట్ గా ప్రకటించడం ఇప్పుడు బీటౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పటి నుండే ఈ షోతో పాటు కరణ్ జోహార్ పై నెటిజన్లు ట్రోల్స్ పెరిగిపోయాయి. కరణ్ జోహార్ ఏంటి.. ఈ షో హోస్ట్ ఏంటని రకరకాల మీమ్స్ తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

మరోవైపు, ఈ షోను బాయికాట్ చేయాలని కూడా మరోవైపు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ డేరింగ్ బ్యూటీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా బాయికాట్ డిమాండ్ ను మొదలుపెట్టి హ్యాష్ ట్యాగ్స్ కూడా సిద్ధం చేసింది. బాలీవుడ్ లో నేపాటిజానికి కీలక సూత్రధారిగా కరణ్ జోహార్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు ఈ షో ద్వారా ఆ వ్యతిరేకతను తెలియజేయాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మొదలుకాక ముందే ఇంతగా అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ షో మొదలైతే ఎలా ఉంటుందో చూడాల్సిఉంది.