Telugu Movies : టాలీవుడ్‌పై బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ''సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఇకపై అన్ని పరిశ్రమలను కలిపి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని పిలవాలి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి.......

Telugu Movies : టాలీవుడ్‌పై బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు

Karan

Tollywood :  గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలు కొత్త కొత్త కథలతో, అంశాలతో వచ్చి మంచి విజయాలు సాధిస్తున్నాయి. మన దగ్గర హిట్ అయిన సినిమాలలో చాలా వరకు బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాలంటూ స్టార్ హీరోలంతా బాలీవుడ్ లో కూడా పాగా వేస్తున్నారు. అక్కడ కూడా భారీగా కలెక్షన్లని సాధిస్తున్నారు. టాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలన్నీ కూడా బాలీవుడ్ ని బీట్ చేస్తున్నాయి ఇటీవల కాలంలో.

 

తాజాగా నిన్న రాత్రి యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘కెజిఎఫ్ చాఫ్టర్2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో కరణ్ మాట్లాడుతూ దక్షిణాది సినిమాలు, టాలీవుడ్ పై ప్రశంసలు కురిపించాడు.

Pushpa : పాన్ ఇండియానా బొక్కా అంటూ ట్వీట్.. సమంత రిప్లై..

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ”సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా ఘన విజయాలు సాధిస్తున్నాయి. ఇకపై అన్ని పరిశ్రమలను కలిపి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని పిలవాలి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విభిన్న తరహా చిత్రాలను చూసి బాలీవుడ్‌ ఫిలింమేకర్స్‌ చాలా నేర్చుకోవాలి. పాత కథలను, రొటీన్ సినిమాలని ఎంచుకోకుండా కొత్త దారిని సృష్టించుకోవడమే తెలుగు సినిమా విజయాలకు కారణం. కానీ బాలీవుడ్‌లో మూసధోరణి కొనసాగుతుంది. బయోపిక్స్‌ హిట్‌ అయితే అంతా ఆ తరహా చిత్రాలనే తీస్తున్నారు. సందేశాత్మక చిత్రాలు విజయం సాధిస్తే అవే తీస్తారు. నాతో సహా మిగిలిన దర్శకనిర్మాతలంతా పక్కవాళ్లు ఏం చేస్తున్నారనే ఆలోచిస్తుంటాం. కానీ తెలుగు సినిమా హాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో ఏం చేస్తున్నారు అని ఆలోచించడం లేదు. తమ సొంత ఆలోచనలతో కొత్త తరహా చిత్రాలను తెరకెక్కిస్తున్నాయి. అందుకే ఇవాళ ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలు బాలీవుడ్‌లో కూడా గొప్ప విజయాలు సాధించాయి” అని తెలిపారు.