Karate Kalyani : మళ్ళీ పెళ్లి చేసుకోడానికి రెడీ.. సహజీవనం అయినా ఓకే..

సినిమాల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించించి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అయితే తన వ్యాఖ్యలతో, వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది కళ్యాణి. గతంలోనే ఈమె.........

Karate Kalyani :  మళ్ళీ పెళ్లి చేసుకోడానికి రెడీ.. సహజీవనం అయినా ఓకే..

Karate Kalyani

Karate Kalyani :  సినీ నటి, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అందరికి సుపరిచితమే. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించించి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అయితే తన వ్యాఖ్యలతో, వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది కళ్యాణి. గతంలోనే ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది.

 

కళ్యాణి తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. ” చాలా మంది భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి. ఎదురు మాట్లాడకూడదు అనుకుంటారు. కానీ నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని. అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా. కానీ అది వాళ్లకి తప్పు అనిపించిందేమో. మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు ఉన్న కాపురం నాకు నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నాను.”

Khiladi Movie : సినిమా హిట్ అవుతుందని ముందే తెలుసు.. అందుకే కార్ గిఫ్ట్ ఇచ్చాను..

”అంతేగాక తరచూ తాగొచ్చి కొడుతుంటే భరించలేకపోయాను. పైగా నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను. అందుకే విడాకులు తీసుకున్నాను. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఏ ఆడది కూడా పడి ఉండదు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని ఆత్మహత్యాయత్నం కూడా చాలా సార్లు చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్నా, అయినా బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఏదో ఉందని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. నాకున్న దాంట్లో పది మందికి సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నాను.”అని తన గతం గురించి చెప్పింది.

7Arts Sarayu : వీడియో వివాదం.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేమ్, 7ఆర్ట్స్ సరయు

మరి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అని అడగగా.. ”నాకు ఈ ప్రేమ, పెళ్లిళ్లు కలిసిరావు, ఇప్పటి వరకు నిజమైన ప్రేమ దొరకలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో మళ్ళీ పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి రెడీనే. లేక సహజీవనం చేస్తా అన్నా కూడా ఓకే. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదు” అని తన బాధలను చెప్పుకొని భావోద్వేగానికి గురయింది కళ్యాణి.