Kareena Kapoor: వివాదంలో కరీనా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం!

కరీనా తనలోని రచయిత్రిని నిద్రలేపిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకాన్ని ఈమధ్యనే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీపై కరీనా రాసిన ఈ పుస్త‌కం అభిమానుల‌తోపాటు అంద‌రి మ‌న‌సులను దోచేసింది. విపరీతంగా ఈ పుస్తకం అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఈ పుస్త‌కాన్ని గత శుక్ర‌వారం (జులై 9న) లాంచ్ చేయ‌గా.. అది మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Kareena Kapoor: వివాదంలో కరీనా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకం!

Kareena Kapoor

Kareena Kapoor: కరీనా తనలోని రచయిత్రిని నిద్రలేపిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకాన్ని ఈమధ్యనే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీపై కరీనా రాసిన ఈ పుస్త‌కం అభిమానుల‌తోపాటు అంద‌రి మ‌న‌సులను దోచేసింది. విపరీతంగా ఈ పుస్తకం అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఈ పుస్త‌కాన్ని గత శుక్ర‌వారం (జులై 9న) లాంచ్ చేయ‌గా.. అది మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. దీని కోసం అమెజాన్‌లో ఆర్డ‌ర్లు వెల్లువలా రావడంతో కొన్ని గంట‌ల్లోనే భారీగా ఆర్డ‌ర్లు సాధించిన పుస్త‌కంగా నిలిచింది.

అయితే.. ఈ పుస్తకంలో గర్భిణీ స్త్రీలకు విలువైన సమాచారం ఉండడం నిజమే కానీ ఈ పుస్తకానికి ఆమె పెట్టిన పేరే ఇప్పుడు వివాదంగా మారింది. ప్రగ్నెన్సీ బైబిల్‌ టైటిల్ ను మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్‌ సంఘాలు వ్యతిరేకిస్తూ శివాజీ నగర్‌ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కరీనాతో పాటు మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. అల్ఫా, ఒమెగా క్రిస్టియన్‌ మహాసంగ్‌ అధ్యక్షుడు ఆశిష్‌ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసు స్టేషన్‌ ఇంచార్జ్‌ శ్రీనాథ్‌ తంభోర్‌ మీడియాకు వెల్లడించారు.

కరీనాతో పాటు ఈ బుక్‌ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జని, బుక్‌ పబ్లిషర్‌ సంస్థ జాగ్గర్‌ నట్‌ బుక్‌పై కూడా ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ షిండే తన ఫిర్యాదులో కరీనా కపూర్‌ బుక్‌ టైటిల్‌ క్రిస్టియన్‌ల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ను అవమానించేలా ఉందని, ఇది క్రిస్టియన్‌ల మనోభావాలను దెబ్బతీస్తుందని ఫిర్యాదులో పేర్కొనగా ఐపీసీ సెక్షన్‌ 295-A కింద కేసు నమోదు చేయాలని ఆశిష్‌ డిమాండ్‌ చేశారట. అయితే దీనిపై ప్రస్తుతానికి ఫిర్యాదు తీసుకున్నా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్‌ అన్నారు. ఇది ముంబై పరిధిలోకి వస్తుందని ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలిపారు.