Kareena Kapoor: రచయిత్రిగా కరీనా.. హాట్ కేకుల్లా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’!
వయసు నలభైకి దగ్గరవుతున్నా, చెక్కు చెదరని అందం బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ సొంతం. తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ నుంచి ఆఖరుగా తెరపై కనిపించిన ‘వీర్ ది వెడ్డింగ్’ వరకూ అదే మెరిసే చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో కరీనా అభిమానుల కళ్ళలో అలా ఉండిపోయింది. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈ భామ ఇప్పటికీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
Kareena Kapoor: వయసు నలభైకి దగ్గరవుతున్నా, చెక్కు చెదరని అందం బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఖాన్ సొంతం. తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ నుంచి ఆఖరుగా తెరపై కనిపించిన ‘వీర్ ది వెడ్డింగ్’ వరకూ అదే మెరిసే చర్మం, ఆకర్షణీయమైన శరీరాకృతితో కరీనా అభిమానుల కళ్ళలో అలా ఉండిపోయింది. సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈ భామ ఇప్పటికీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. పెళ్లై, పిల్లలున్నా తరగని అందం ఆమెది.. ఎంతో మంది యువకులకు స్వప్న సుందరి ఆమె.
ఇదంతా ఆమె నటిగా మాత్రమే ప్రపంచానికి తెలుసు కానీ ఆమెలో ఓ రచయిత్రి కూడా ఉన్నారు. కరీనా తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ప్రెగ్నెన్సీపై కరీనా రాసిన ఈ పుస్తకం అభిమానులతోపాటు అందరి మనసులను దోచేసింది. విపరీతంగా ఈ పుస్తకం అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఈ పుస్తకాన్ని శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. దీని కోసం అమెజాన్‌లో ఆర్డర్లు వెల్లువలా రావడంతో కొన్ని గంటల్లోనే భారీగా ఆర్డర్లు సాధించిన పుస్తకంగా నిలిచింది.
ఈ పుస్తకం విడుదల సందర్భంగా ఒక విధంగా ఇది తన మూడో బిడ్డ లాంటిదని వ్యాఖ్యానించిన కరీనా.. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైందన్న ఆమె తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి మానసిక, శారీరక అనుభవాలు, కష్ట నష్టాలను, పలువురి నిపుణుల సలహాలు, సూచనలను ఇందులో పొందుపర్చినట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. భారత స్త్రీ గైనాకాలజిస్ట్ నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అయిన ఎఫ్ఓజీఎస్ఐ చేత ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ ధృవీకరించబడడం విశేషం!
View this post on Instagram