Kareena Kapoor : లాల్‌ సింగ్‌ చడ్డాను కొందరు టార్గెట్‌ చేశారు.. ఈ సినిమాని బహిష్కరిస్తే మంచి సినిమాని ప్రేక్షకులకు దూరం చేసినట్లే..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కరీనా కపూర్ ని ‘లాల్‌ సింగ్‌ చడ్డా ఓపెనింగ్స్‌ ఆశించిన రీతిలో లేవు.. దీనిపై మీ స్పందనేంటి?’ అని ఓ విలేఖరి అడగగా కరీనా కపూర్ దీనిపై స్పందిస్తూ...........

Kareena Kapoor : లాల్‌ సింగ్‌ చడ్డాను కొందరు టార్గెట్‌ చేశారు.. ఈ సినిమాని బహిష్కరిస్తే మంచి సినిమాని ప్రేక్షకులకు దూరం చేసినట్లే..

Kareena Kapoor :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగ చైతన్య మెయిన్ లీడ్స్ లో ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ సినిమా. నాగ చైతన్య కూడా నటిస్తుండటంతో తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఆమీర్ ఖాన్ నుంచి నాలుగేళ్ల తర్వాత సినిమా రానుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

అయితే ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాకి బాయ్ కాట్ సెగ తగిలింది. అమీర్ ఖాన్ గతంలో భారతదేశాన్ని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వ్యాఖ్యలని గుర్తుచేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇది సినిమాకి బాగానే ఎఫెక్ట్ అయింది. ‘లాల్‌సింగ్‌ చడ్డా’ మొదటి రోజు ఓపెనింగ్స్ కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చాయి. అమీర్ ఖాన్ కి ఇది చాలా తక్కువ ఓపెనింగ్స్. సినిమా ఫలితం కూడా ఆశించినంతగా లేదు. గతంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా బహిష్కరణపై స్పందించారు.

Vijay Devarakonda: లైగర్ కోసం రౌడీ ఎంతపుచ్చుకున్నాడంటే?

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కరీనా కపూర్ ని ‘లాల్‌ సింగ్‌ చడ్డా ఓపెనింగ్స్‌ ఆశించిన రీతిలో లేవు.. దీనిపై మీ స్పందనేంటి?’ అని ఓ విలేఖరి అడగగా కరీనా కపూర్ దీనిపై స్పందిస్తూ.. ”లాల్‌ సింగ్‌ చడ్డా సినిమాని కొందరు టార్గెట్‌ చేశారు. మొత్తం ప్రేక్షకుల్లో వాళ్ళు కేవలం 1శాతం ఉంటారు. వాళ్లే ఈ చిత్రాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. మిగతావాళ్ళు ఈ సినిమాని అభినందిస్తున్నారు. ఈ సినిమాని బహిష్కరిస్తే ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు దూరం చేసినట్లే. రెండున్నరేళ్లు 250మంది ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మూడేళ్ల నుంచి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి లాల్‌ సింగ్‌ చడ్డాని బహిష్కరించకండి’ అంటూ రిక్వెస్ట్ చేసింది.