Karthi : జపాన్ మేడ్ ఇన్ ఇండియా.. కామెడీ విలన్ గా కార్తీ గ్లింప్స్ రిలీజ్..

నేడు కార్తీ పుట్టిన రోజు నాడు జపాన్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో కార్తీ అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Karthi : జపాన్ మేడ్ ఇన్ ఇండియా.. కామెడీ విలన్ గా కార్తీ గ్లింప్స్ రిలీజ్..

Karthi Japan Movie glimpse released

Japan : కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా జపాన్. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కామెడీ డాన్ గా కార్తీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు కార్తీ పుట్టిన రోజు కావడంతో జపాన్ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో కార్తీ.. జపాన్.. మేడ్ ఇన్ ఇండియా అంటూ మెప్పించాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళికి పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

Bharathi Raja : అప్పుడు కొడుకుని తండ్రి డైరెక్ట్ చేశాడు.. ఇప్పుడు తండ్రిని కొడుకు డైరెక్ట్ చేయబోతున్నాడు..

నేడు కార్తీ పుట్టిన రోజు నాడు జపాన్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో కార్తీ అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో కార్తీ గోల్డ్ పళ్లతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. కొత్త కొత్త కథలతో వచ్చి హిట్స్ కొడుతున్న కార్తీ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడా చూడాలి మరి.