Karthi: గొంతు సవరిస్తున్న కార్తి.. పక్కా హిట్ అంటోన్న మ్యూజిక్ డైరెక్టర్!

తమిళ హీరో కార్తి ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటించి, తన పాత్రకు మంచి పేరును తీసుకొచ్చాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ డైరెక్ట్ చేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Karthi: గొంతు సవరిస్తున్న కార్తి.. పక్కా హిట్ అంటోన్న మ్యూజిక్ డైరెక్టర్!

Karthi To Sing A Song For His Next Movie

Karthi: తమిళ హీరో కార్తి ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నటించి, తన పాత్రకు మంచి పేరును తీసుకొచ్చాడు. ఆయన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్దార్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ డైరెక్ట్ చేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

Karthi Sardar Teaser: సర్దార్ టీజర్.. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేక పెట్టిస్తున్న కార్తి!

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో కార్తి రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం కార్తి సింగర్ అవతారం ఎత్తబోతున్నట్లు చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాశ్ కుమార్ తెలిపాడు. తమిళంలో ప్రాచుర్యం పొందిన ఓ జానపద గీతాన్ని కార్తి పాడుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. సర్దార్ సినిమాలో రజిషా విజయన్, చంకీ పాండే, లైలా, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Karthi : ఆల్రెడీ బాహుబలి చూశాం.. ఇంకో బాహుబలి అవసర్లేదు..

కాగా, ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి సర్దార్ సినిమాలో కార్తి పాడుతున్న పాట ఎలా ఉండబోతుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.