Shehzada: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంటు.. భలే ఉన్నాడుగా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న ఈ సినిమాకు ‘షెహజాదా’ అనే టైటల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Shehzada: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బంటు.. భలే ఉన్నాడుగా!

Karthik Aryan Shehzada Teaser Of Ala Vaikuntapurramulo Remake Impressive

Shehzada: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను త్రివిక్రమ్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించిన తీరుకు, థమన్ అల్ట్రా క్లాసిక్ మ్యూజిక్ తోడవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Karthik Aaryan: బాలీవుడ్‌కు హిట్ ఇచ్చాడు.. కరోనా బారిన పడ్డాడు!

ఇక ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న ఈ సినిమాకు ‘షెహజాదా’ అనే టైటల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దర్శకుడు రోహిత్ ధావన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కార్తిక్ లుక్స్ రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమా కథ ముందే తెలుసు కాబట్టి, వాళ్లకు ఈ టీజర్ చూస్తే కొత్తదనం ఏమీ కనిపించదు.

Karthk Aaryan : 20 కోట్లు ఇస్తా పెళ్లి చేసుకుంటావా? బాలీవుడ్ హీరోకి నెటిజన్ ఆఫర్..

కానీ బాలీవుడ్ జనాలకు మాత్రం ఇది ఖచ్చితంగా సరికొత్త కథగా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు బాలీవుడ్ ప్రేక్షకులు పట్టం కట్టడం మనం గతంలో చూశాం. ఈ లెక్కన ఇప్పుడు ఈ షెహజాదా చిత్రానికి కూడా వారు ఖచ్చితంగా ఆదరణ చూపిస్తారని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తోండగా, మనీషా కొయిరాల, రోనిత్ బోస్ రాయ్, పరేష్ రావల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టి సిరీస్, అల్లు అరవింద్, రాధాకృష్ణలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.