Karthikeya 2: మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టిన కార్తికేయ-2

టాలీవుడ్‌లో తెరకెక్కిన కార్తికేయ-2 సినిమాపై రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. కార్తికేయ-2 మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టి తన సత్తా చాటింది.

Karthikeya 2: మిలియన్ డాలర్ క్లబ్‌లో అడుగుపెట్టిన కార్తికేయ-2

Karthikeya 2 Enters 1 Million Dollar Club

Karthikeya 2: టాలీవుడ్‌లో తెరకెక్కిన కార్తికేయ-2 సినిమాపై రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ముఖ్యంగా కృష్ణతత్వం గురించి ఈ సినిమాలో ఎలివేట్ చేసిన విధానం కేవలం సౌత్ ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్‌ను సైతం ఈ సినిమా కోసం క్యూ కట్టేలా చేస్తోంది. యావత్ ఇండియా‌వైడ్‌గా కార్తికేయ-2 చిత్రం కలెక్షన్లతో బాక్సాఫీస్ భరతం పడుతోంది.

Pawan Kalyan Abou Karthikeya 2: పవన్ కళ్యణ్ నోట ‘కార్తికేయ-2’ మాట.. ఇదే కావాలట!

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కార్తికేయ-2 సినిమాకు మొదట్నుండీ మంచి బజ్ రావడంతో, ఈ సినిమాకు అక్కడ వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా కార్తికేయ-2 మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి అడుగుపెట్టి తన సత్తా చాటింది. ఇటీవల ఓవర్సీస్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన సినిమా లేకపోవడంతో కార్తికేయ-2 మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

Karthikeya 2 Collections: కార్తికేయ-2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆ మార్క్‌ను టచ్ చేసిన నిఖిల్!

నిఖిల్ సిద్ధార్థ్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్, చందూ మొండేటి తెరకెక్కించిన విధానం కలగలిసి కార్తికేయ-2 సినిమాను భారీ సక్సెస్ చేశాయి. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాళభైరవ సంగీతం అందించిన కార్తికేయ-2 చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టిజి.విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.