Karthikeya2: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న కార్తికేయ-2 సినిమా..

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు ముండేటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా "కార్తికేయ-2". సినీ సాంకేతిక నిపుణులు నుంచి దేశంలోని కొందరు రాజకీయ నాయకులు వరకు అందరి అభినందనలు అందుకుంటూ వచ్చింది. కాగా ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఈ సినిమా. అమెరికాలో...

Karthikeya2: మరో అరుదైన గౌరవం దక్కించుకున్న కార్తికేయ-2 సినిమా..

Karthikeya-2 is getting another rare honor

Karthikeya2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు చందు ముండేటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా “కార్తికేయ-2”. చిన్న సినిమాగా వచ్చి, పాన్ ఇండియా లెవెల్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. సినీ సాంకేతిక నిపుణులు నుంచి దేశంలోని కొందరు రాజకీయ నాయకులు వరకు అందరి అభినందనలు అందుకుంటూ వచ్చింది.

Siva Karthikeyan : సౌత్ సినిమాల సక్సెస్ పై స్పందించిన శివ కార్తికేయన్.. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి..

కాగా ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఈ సినిమా. అమెరికాలో కూడా ఈ చిత్రం అఖండమైన విజయాన్ని అందుకోవడంతో.. ‘న్యూ జెర్సీ ఎడిసన్’ మేయర్ హీరో నిఖిల్ ని గౌరవ పత్రం ఇచ్చి అభినందిచారు. “కార్తికేయ-2లో కనబరిచిన నిఖిల్ నటన అద్భుతం” అంటూ కొనియాడాడు ఎడిసన్ మేయర్.

“ఇంతటి గౌరవం అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు నిఖిల్. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ హీరో “18 పేజిస్” అనే లవ్ రొమాంటిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పలనాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.