Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?

యంగ్ హీరో కార్తికేయ సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆయన చివరిసారిగా తమిళ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో కనిపించాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?

Karthikeya Bedurulanka 2012 First Look Impressive

Bedurulanka 2012: యంగ్ హీరో కార్తికేయ సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. ఆయన చివరిసారిగా తమిళ హీరో అజిత్ నటించిన ‘వలిమై’ సినిమాలో కనిపించాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సరికొత్త నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Kartikeya Gummakonda : తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న హీరో కార్తికేయ..

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ డిజైన్ పరిశీలిస్తే, ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటో మనకు అర్థమవుతోంది. ఈ సినిమాను 2012 యుగాంతం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లుగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అయితే అప్పుడు ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలకు ఫన్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరికొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, పలువురు సినీ క్రిటిక్స్ 2012 యుగాంతం నేపథ్యంలో వస్తున్న సినిమా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అని పలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

Kartikeya: హిట్టు ఫట్టు కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్స్ పట్టేస్తున్న హీరో!

ఈ సినిమాలో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, క్లాక్స్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. కామెడీ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉండగా, ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ ‘బెదురులంక 2012’ హీరో కార్తికేయకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.