Bedurulanka 2012 Teaser: యుగాంతం కాన్సెప్ట్‌తో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిన కార్తికేయ..!

‘ఆర్ఎక్స్ 100’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ ఆ తరువాత సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండటంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఓ కొత్త జోనర్ మూవీతో మనముందుకు రాబోతున్నాడు ఈ హీరో. యుగాంతం అనే నేపథ్యంలో ఓ ఊరిలో జరిగే పరిణామాలను మనకు కామెడీ టచ్‌తో చూపెట్టేందుకు రెడీ అయ్యాడు కార్తికేయ.

Bedurulanka 2012 Teaser: యుగాంతం కాన్సెప్ట్‌తో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిన కార్తికేయ..!

Karthikeya Bedurulanka 2012 Teaser Filled With Laughs

Bedurulanka 2012: ‘ఆర్ఎక్స్ 100’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ ఆ తరువాత సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. ఆయన నటిస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండటంతో, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఓ కొత్త జోనర్ మూవీతో మనముందుకు రాబోతున్నాడు ఈ హీరో. యుగాంతం అనే నేపథ్యంలో ఓ ఊరిలో జరిగే పరిణామాలను మనకు కామెడీ టచ్‌తో చూపెట్టేందుకు రెడీ అయ్యాడు కార్తికేయ.

Bedurulanka 2012: బెదురులంక 2012 గ్లింప్స్.. ఈసారి కార్తికేయ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా!

క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ కామెడీ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. గతంలో ఈ సినిమాకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ టీజన్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఫన్ ఎలిమెంట్స్‌తో నింపేశారు చిత్ర యూనిట్. 2012లో యుగాంతం రాబోతుందనే కారణంగా బెదురులంక గ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఆ గ్రామస్థులు ఆ రోజున ఎలాంటి పనులు చేశారు.. అనే అంశాలతో ఈ సినిమా సాగనుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?

ఇక ఈ సినిమాలో కార్తికేయ లుక్ కొత్తగా ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఈ సినిమాలో హాట్ అందాలతో మరోసారి యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రవీంద్ర బెనర్జీ ముప్పనేని ప్రొడ్యూస్ చేస్తుండగా, వచ్చే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.