Bedurulanka 2012: బెదురులంక 2012 గ్లింప్స్.. ఈసారి కార్తికేయ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా!

‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడు చూపెట్టాడు. అయితే వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో, ఇప్పుడు సినిమాలను చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Bedurulanka 2012: బెదురులంక 2012 గ్లింప్స్.. ఈసారి కార్తికేయ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా!

Karthikeya Bedurulanka 2012 Video Glimpse Impressive

Bedurulanka 2012: ‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకున్న యంగ్ హీరో కార్తికేయ, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూకుడు చూపెట్టాడు. అయితే వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో, ఇప్పుడు సినిమాలను చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక కార్తికేయ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?

కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 2012 యుగాంతం సమయం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించింది చిత్ర యూనిట్. ఆ సమయంలో యుగాంతం వస్తుందనే ప్రచారం జోరుగా ఉండటంతో, ఒక పల్లెటూరులో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సినిమాలో మనకు చూపించబోతున్నారు. ఇక ఈ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కామెడీని జోడించి ఈ సినిమాతో సక్సెస్ కొట్టేందుకు చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో అందాల భామ నేహా శెట్టి నటిస్తుండగా, కార్తికేయతో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఆడియెన్స్‌లో క్రియేట్ అవుతోంది. ఇక పల్లెటూరిలో యుగాంతం నమ్మకాలు, ఆ మధ్యలో హీరోహీరోయిన్ రొమాన్స్‌తో రాబోతున్న ఈ సినిమాను క్లాక్స్ డైరెక్ట్ చేస్తుండగా, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.