Kartikeya8: క్రేజీ బ్యానర్ లో కార్తికేయ సినిమా.. ఈసారైనా హిట్టు అందుకుంటాడా?

యూవీ క్రియేషన్స్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాతలు ప్రభాస్ కు బంధువులే కాకుండా స్నేహితులు. అందుకే యూవీతో సినిమాలు చేసే హీరోలు కూడా ప్రభాస్ స్నేహితులు..

Kartikeya8: క్రేజీ బ్యానర్ లో కార్తికేయ సినిమా.. ఈసారైనా హిట్టు అందుకుంటాడా?

Kartikeya8

Kartikeya8: యూవీ క్రియేషన్స్ అంటే రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటిది. నిర్మాతలు ప్రభాస్ కు బంధువులే కాకుండా స్నేహితులు. అందుకే యూవీతో సినిమాలు చేసే హీరోలు కూడా ప్రభాస్ స్నేహితులు.. లేదంటే నిర్మాతల స్నేహితులే అయి ఉంటారు. జిల్ సినిమాతో ప్రొడక్షన్ ఎంట్రీ ఇచ్చిన యూవీ క్రియేషన్స్ సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో మోస్ట్ బిగ్ బ్యానర్ గా అవతరించింది. అయితే, ఒకపక్క పెద్ద పెద్ద సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో పక్క చిన్న సినిమాలు తీయడానికి కూడా ముందుకొస్తుంది యూవీ క్రియేషన్స్.

Kartikeya Wedding : ‘పెద్దయ్యాక హీరో అవుతా.. అప్పుడు నా పెళ్లికి చిరంజీవి వస్తాడు’

ఈ మధ్య పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించిన ఈ బ్యానర్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలకు సైతం తమ బ్యానర్ లలో నటించే అవకాశం కల్పిస్తుంది. యంగ్ హీరోలు కూడా ఈ బ్యానర్ లో చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్ హీరో ఈ బ్యానర్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఆ హీరో ఎవరో కాదు కార్తికేయ. కార్తికేయ‌తో ఓ సినిమాను చేయ‌బోతున్న‌ట్లుగా యూవీ క్రియేషన్స్ తాజాగా ప్ర‌క‌టించింది.

Kartikeya Wedding : లోహితను పెళ్లాడిన కార్తికేయ..

గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు కార్తికేయ. పాత్ర నచ్చాలే కానీ ప్రతి నాయకుడి పాత్రకైనా సై అనే కార్తికేయ ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ, ఇటీవల అజిత్ ‘వలిమై’లోనూ విలన్ పాత్రలే పోషించాడు. కానీ ఆ సినిమాలు కూడా అతనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. తాజాగా యూవీ క్రియేషన్స్ లో సినిమా ఒకే చేశాడు. ఈ సినిమాతో ప్ర‌శాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతుండగా.. హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. తాజాగా అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేసిన యూవీ సంస్థ.. శరవేగంగా షూటింగ్ జరుపుతున్నట్టు తెలిపింది. మరి కార్తికేయ ఈ సినిమాతో అయినా మళ్ళీ సక్సెస్ కొట్టి ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.