Karthikeya2: కార్తికేయ-2 ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ..!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ బెస్ట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ మూవీగా ‘కార్తికేయ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసిన....

Karthikeya2: కార్తికేయ-2 ఫస్ట్ లుక్ పోస్టర్ రెడీ..!

Karthikeya2 First Look Poster To Be Released Tomorrow

Karthikeya2: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ బెస్ట్ మూవీ ‘కార్తికేయ’కు సీక్వెల్ మూవీగా ‘కార్తికేయ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ, ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ వచ్చినా మిస్ కాకుండా ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్. ఇక తొలి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు చందు ముండేటి, ఈ సీక్వెల్ మూవీని కూడా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుకుటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

‘కార్తికేయ 2’ షూటింగ్‌‌లో ప్రమాదం.. నిఖిల్‌కు గాయాలు..

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుందని, చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో ఈ సినిమాను జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కార్తికేయ-2 సినిమా నుండి ఓ అదిరిపోయే అప్ డేట్ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Nikhil: సీక్రెట్ రివీల్ చేసేందుకు కార్తికేయ డేట్ ఫిక్స్ చేశాడు!

జూన్ 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను రేపు(జూన్ 1) ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ పాత్ర చాలా ఎంగేజింగ్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్ గా నటిస్తోండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.