Kartik Aaryan: ఇద్దరు దర్శకుల మధ్య నలిగిపోతున్న ఆర్యన్.. బన్నీ సినిమానే కారణం!

లుగులో సూపర్ హిట్ అయిన అలవైకుంఠపురం హిందీలో మాత్రం రోజుకో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తోంది. స్టార్ హీరో అల్లు అర్జున్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హిందీలో అప్ కమింగ్ యంగ్ హీరో కార్తిక్..

Kartik Aaryan: ఇద్దరు దర్శకుల మధ్య నలిగిపోతున్న ఆర్యన్.. బన్నీ సినిమానే కారణం!

Kartik Aaryan

Kartik Aaryan: తెలుగులో సూపర్ హిట్ అయిన అలవైకుంఠపురం హిందీలో మాత్రం రోజుకో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తోంది. స్టార్ హీరో అల్లు అర్జున్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హిందీలో అప్ కమింగ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ చేస్తున్నాడు. కార్తిక్ ఆర్యన్ అస్సలు అన్ ప్రొఫెషనల్ అని అలవైకుంఠపురం హిందీ నిర్మాత అంటుంటే.. అబ్బే అసలు కార్తిక్ ఆర్యన్ లాంటి పక్కా ప్రొఫెషనల్ మనిషి ఇంకొకరు లేరు అంటూ అలవైకుంఠపురాన్ని హిందీలో చేస్తున్న ప్రొడ్యూసర్ అంటున్నారు. ఇంతకీ ఇద్దరు ప్రొడ్యూసర్ల మధ్యలో ఇరుక్కున్న ఆర్యన్ పరిస్తితేంటి అని ఇప్పుడు చర్చ నడుస్తుంది.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

అల్లుఅర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్లో త్రివిక్రమ్ డైరెక్షన్లో 2020 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ అలవైకుంఠపురంలో. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే.. బాలీవుడ్ వాళ్లే కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా ఈ సినిమా పాటలకు స్టెప్పులేసేంతగా సూపర్ హిట్ అయ్యింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాని అలవైకుంఠపురంలో సినిమాని హిందీలో షెహజాదాగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ కన్నా.. హిందీలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చేస్తున్న కార్తీక్ ఆర్యన్ తోనే ఈ సినిమా న్యూస్ లో నిలుస్తోంది.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

అల్లు అర్జున్ క్యారెక్టర్ చేస్తున్న కార్తీక్ ఆర్యన్ మీద రోజుకో ఎలిగేషన్ తెరమీదకొస్తోంది. షెహజాదా సెట్స్ మీదకెళ్లకముందే అలవైకుంఠపురం హిందీ డబ్బింగ్ రైట్స్ ని 2 కోట్లకు దక్కించుకున్న మనీష్ షా.. ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కార్తీక్ ఆర్యన్.. తను రీమేక్ చేస్తున్న అలవైకుంఠపురాన్ని హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే.. సినిమాని మధ్యలో ఆపేసి వెళ్లిపోతానని బెదిరించినట్టు ఇష్యూ రెయిజ్ చేశారు మనీష్ షా.

Ananya Nagalla: వయ్యారాలతో అదరగొడుతున్న అనన్య నాగళ్ల!

కార్తీక్ ఆర్యన్.. షెహజాదా 40కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాదు.. షెహజాదాకి అల్లు అరవింద్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. హిందీ డబ్బింగ్ మూవీని రిలీజ్ చేస్తే.. అనవసరంగా 40కోట్లు నష్టంవస్తుందని.. అందుకే ధియేటర్లో రిలీజ్ చెయ్యడం లేదని అనౌన్స్ చేశారు మనీష్ షా. అయితే కార్తీక్ ఆర్యన్ అన్ ప్రొఫెషనల్ అని, అసలు ఏమాత్రం నిర్మాతల మీదగౌరవం లేదని ఆరోపించారు మనీష్. మరోవైపు అసలు షెహజాదా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ మాత్రం కార్తీక్ చాలా ప్రొఫెషనల్ అని, కమిటెడ్ గావర్క్ చేస్తాడని, ఎలాంటి ఇబ్బందులు పెట్టడని అంటున్నారు. ఇలా అల్లు అర్జున్ క్యారెక్టర్ చేస్తున్న కార్తీక్ మాత్రం ఇద్దరు ప్రొడ్యూసర్ల మధ్యలో నలిగిపోతున్నాడు.