Katrina Kaif : పెళ్లి తర్వాత కత్రినా ఫస్ట్ సినిమా విజయ్ సేతుపతితో

బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినాలు ఇటీవల చాలా సీక్రెట్ గా రాజస్థాన్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట ఒక వారం రోజులు రాజస్థాన్, మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసి.....

Katrina Kaif : పెళ్లి తర్వాత కత్రినా ఫస్ట్ సినిమా విజయ్ సేతుపతితో

Katrinakaif

Katrina Kaif :  బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినాలు ఇటీవల చాలా సీక్రెట్ గా రాజస్థాన్ లో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ కొత్త జంట ఒక వారం రోజులు రాజస్థాన్, మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసి మళ్ళీ తమ వర్క్స్ లో మునిగిపోయారు. తాజాగా కత్రినా తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసింది. అది కూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా గురించి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది కత్రీనా.

Pushpa : ఆ సీన్‌లో బన్నీని, ఫాహిద్ ఫాజిల్‌ని నగ్నంగా చూపిద్దాం అనుకున్నా : సుకుమార్

ఇప్పటికే తమిళ్ , తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న విజయ్‌ సేతుపతి ఇప్పుడు బాలీవుడ్‌ లో కత్రినా కైఫ్‌తో జతకట్టబోతున్నాడు. ఈ సినిమాకి ‘మేరీ క్రిస్మస్‌’ అనే టైటిల్ పెట్టారు. ఈ విషయంపై కత్రీనా కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ”ఇంతకు ముందు ఏజెంట్‌ వినోద్‌ బద్లాపూర్, అందాదూన్‌ లాంటి సక్సెస్ సినిమాలు తీసిన దర్శకుడు శ్రీరామ్‌ రాగవన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఆయన దర్శకత్వంలో నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను. కథను థ్రిల్లింగ్‌గా రూపొందించడంలో ఆయన మాస్టర్‌. విజయ్‌ సేతుపతితో కలిసి నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు” తెలిపింది కత్రీనా.