Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!

బాలీవుడ్ రూమర్డ్ కపుల్.. కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ మిస్టరీ మ్యారేజ్ గానే అనిపిస్తోంది. డిసెంబర్ సెకండ్ వీక్ లో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట ఇప్పటికీ ఈ న్యూస్ ని అఫీషియల్ గా..

Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!

Katrina Vicky

Katrina-Vicky: బాలీవుడ్ రూమర్డ్ కపుల్.. కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ మిస్టరీ మ్యారేజ్ గానే అనిపిస్తోంది. డిసెంబర్ సెకండ్ వీక్ లో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట ఇప్పటికీ ఈ న్యూస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు. అయితే వీళ్ల పెళ్లి జరుగుతోందంటూ అఫీషియల్ గా స్ట్రాంగ్ ప్రూవ్ దొరికింది. యురితో హ్యాపెనింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్కీ కౌషల్ .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ కి మధ్య ఏదో నడుస్తోందని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అవేం పట్టించుకోకుండా ఏమాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకుండానే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు ఈ జంట.

Actor Srikanth: లెజెండ్‌తో జగపతి.. అఖండతో శ్రీకాంత్ దశ తిరిగేనా?

అయితే వీళ్లపెళ్లి సెక్యూరిటీ గురించి కలెక్టర్ మీటింగ్ పెట్టడంతో వీళ్ల పెళ్లి అఫీషియల్ అంటూ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. డిసెంబర్ 7,8,9 తేదీల్లో కత్రినా-విక్కీ కౌషల్ పెళ్ళి చేసుకుంటున్నారంటూ చాలా కాలం నుంచి న్యూస్ నడుస్తున్నా.. దీనికి సంబందించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడంతో మిస్టరీ వెడ్డింగ్ గానే ఈ సెలబ్రిటీ వెడ్డింగ్ టాక్ నడుస్తోంది. అంతేకాదు.. మొన్నీమధ్య విక్కీ కౌషల్ కజిన్ కూడా పెళ్లా.. వీళ్లకా..? ఛాన్సే లేదంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చిందని బాలీవుడ్ న్యూస్ వేసింది.

Alekhya Harika: నిలువెల్లా నిషా ఎక్కించేస్తున్న దేత్తడి హారికా!

అయితే.. ఇవన్నీ నిజం కాదని విక్కీ-కత్రినా పెళ్లి నిజమని.. వీళ్ల పెళ్లి సెక్యూరిటీ, ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లపై రాజస్తాన్ లోని సవాయిమాధోపూర్ జిల్లా కలెక్టర్ శుక్రవారం మీటింగ్ పెట్టడంతో పెళ్లి కన్ ఫామ్ అయ్యింది. కత్రినా-విక్కీ రాజస్తాన్.. మాధోపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేసుకున్నారని, దానికోసం ప్యాలెస్ కూడా బుక్ చేశారని కూడా సోషల్ మీడియాలో న్యూస్ బయటికొచ్చింది.

Chiranjeevi: ఒకేసారి మూడు సినిమాలు.. మెగాస్టార్ షటిల్ సర్వీస్!

ఆల్రెడీ సీక్రెట్ గా బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇంట్లో ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, సవ్యసాచి డిజైనర్ తో డ్రెస్ లు కూడా రెడీ అయ్యాయంటూ రోజుకో న్యూస్ బాలీవుడ్ ప్రజెంట్ చేస్తూనే ఉంది. అంతేకాదు.. ఈవారంలోనే కత్రినా-విక్కీ కోర్టు మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ మరో న్యూస్ కూడా ఉంది. అయినా.. పెళ్లి నిజమా కాదా అని ఇంకా డైలమాలో ఉన్న ఫ్యాన్స్ ఇంకొక్క వన్ వీక్ ఆగితే తెలుసుకోవచ్చు.