Salaar: క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌తో క్యాట్ స్పెషల్ సాంగ్!

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ వేరు.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ వేరు. టాప్ హీరోయిన్స్.. క్రేజీ స్టార్స్ కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కత్రినా లాంటి స్టార్ అయితే ఇప్పటికే చికినీ చమేలీ పాట యావత్ దేశాన్ని ఓ ఊపేసింది. ఇక, ఇప్పుడు మరోసారి మరో స్పెషల్ సాంగ్ తో క్యాట్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

Salaar: క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్‌తో క్యాట్ స్పెషల్ సాంగ్!

Salaar

Salaar: ఒకప్పుడు ఐటెం సాంగ్స్ వేరు.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ వేరు. టాప్ హీరోయిన్స్.. క్రేజీ స్టార్స్ కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందునా బాలీవుడ్ లో అయితే అసలు ఈ సాంగ్స్ కు ఉండే క్రేజే వేరు. ఇక కత్రినా లాంటి స్టార్ అయితే ఇప్పటికే చికినీ చమేలీ పాట యావత్ దేశాన్ని ఓ ఊపేసింది. ఇక, ఇప్పుడు మరోసారి మరో స్పెషల్ సాంగ్ తో క్యాట్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస క్రేజీ ప్రాజెక్టులతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తిచేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో సలార్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. కేజేఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను అంచనాలను మించేలా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ లుక్స్ భారీ అప్లాజ్ సొంతం చేసుకున్నాయి.

సలార్ సినిమాలో ప్రభాస్ జోడిగా శృతిహాసన్ నటిస్తుండగా ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కాగా, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కత్రినా కైఫ్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. భారీ మొత్తం చెల్లించి మరీ క్యాట్ కోసం స్పెషల్ సాంగ్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. కత్రినా డాన్స్ అంటే బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఓ రేంజ్ క్రేజ్ ఉండగా.. అది కూడా సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.