Katrina-Vicky: ప్రెగ్నెంట్ రూమర్స్.. క్యాట్, విక్కీ గుడ్ న్యూస్ చెప్తారా?

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌషల్ -కత్రినా కైఫ్.. గతేడాది రాజస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వరకూ ఎలాంటి హింట్ ఇవ్వని ఈ జంట పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటయ్యామని పోస్ట్ పెట్టి షాకిచ్చారు.

Katrina-Vicky: ప్రెగ్నెంట్ రూమర్స్.. క్యాట్, విక్కీ గుడ్ న్యూస్ చెప్తారా?

Katrina Vicky

Katrina-Vicky: బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌషల్ -కత్రినా కైఫ్.. గతేడాది రాజస్తాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వరకూ ఎలాంటి హింట్ ఇవ్వని ఈ జంట పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఒక్కటయ్యామని పోస్ట్ పెట్టి షాకిచ్చారు.. ప్రజెంట్ బాలీవుడ్ లో కత్రినా ప్రెగ్నెన్సీ పై చర్చ హాట్ టాపిక్ అయ్యింది. కత్రినా, విక్కీ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. మరి కత్రినా తల్లి కాబోతుందా, లేదా?

Katrina-Vicky: కైఫ్-కౌషల్ వారి పెళ్లిసందడి.. అంతా ఓపెన్ సీక్రెట్!

కత్రినా తల్లికాబోతుంది అనే టాపిక్ ఇప్పుడు వైరలయ్యింది. లాస్ట్ ఇయర్ పెళ్లితో క్రేజీ కపుల్ అయిపోయిన కత్రినా, విక్కీ ఇప్పటికీ కెరీర్ లో ఫుల్ బిజీగాఉన్నారు. గోవిందా నామ్ మెరా & లక్ష్మణ్ ఉటేకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు విక్కీ కౌశల్. ఇక కత్రినా సల్మాన్ ఖాన్ తో నటించిన టైగర్ 3తో పాటు, విజయ్ సేతుపతితో మేరీ క్రిస్మస్ ఇంకా జీ లే జరా మూవీతో బిజీగా ఉంది.

Katrina-Vicky: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. ప్రూఫ్స్ రివీల్!

ఈ మధ్య కత్రినా కైఫ్ తల్లికాబోతుందంటూ వార్తలు వినిపించాయి.. రీసెంట్ గా కత్రినా కైఫ్ ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరలయ్యింది. పింక్ కలర్ చుడీదార్లో వెళ్తున్న ఆమె బొద్దుగా, పొట్ట కాస్త ముందుకు వచ్చినట్టుగా కనిపించింది. దాంతో అది చూసిన వాళ్లు ఆమె ప్రెగ్నెంట్ అని ఫీలై, సోషల్ మీడియాలో విక్కీ, కత్రినా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఆ కామెంట్స్ వైరలవడంతో దీనిపై కత్రినా ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

Katrina-Vicky: ఏంటి.. కత్రినా-విక్కీ నిశ్చితార్ధం జరిగిపోయిందా?

కత్రినా ప్రెగ్నెంట్ పైన వచ్చిన వార్తలన్నీ రూమర్సేనని, కత్రినాకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఇప్పటికైతే ఎలాంటి గుడ్ న్యూస్ లేదని, కత్రినా పూర్తిగా తన కెరీర్ మీదే దృష్టి పెట్టిందని కత్రినా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కత్రినా విక్కీ అమెరికా టూర్ లో ఉన్నారు. అక్కడ ప్రియాంకా చోప్రా రెస్టారెంట్ కు వెళ్లిన ఫోటోలు తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది కత్రినాకైఫ్.