RGV – Keeravani : కీరవాణితో వర్మ ఆ బ్లాక్ బస్టర్ సినిమా చేయాల్సి ఉంది.. కానీ ఏమైంది!

క్షణం క్షణం సినిమాతో కీరవాణి కెరీర్ ని నిలబెట్టిన రామ్ గోపాల్ వర్మ.. తన బ్లాక్ బస్టర్ సినిమాకి కీరవాణిని ఎంపిక చేసుకున్నాడట. కానీ కొందరి బలవంతం కారణంగా..

RGV – Keeravani : కీరవాణితో వర్మ ఆ బ్లాక్ బస్టర్ సినిమా చేయాల్సి ఉంది.. కానీ ఏమైంది!

Keeravani is the first choice for Ram Gopal Varma siva

RGV – Keeravani : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి నాటు నాటు (Naatu Naatu) సాంగ్ తో ఆస్కార్ అందుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజమౌళి తెరకెక్కించిన RRR లోని ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ డాన్స్ కోరియోగ్రఫీ చేయగా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. దీంతో ఇండియాకి మొదటి ఆస్కార్ ని టాలీవుడ్ తరుపు నుంచి తీసుకు వచ్చేలా చేసింది.

Chef Mehigan : నాటు నాటు వినలేదు.. RRR తెలియదు.. ఫేమస్ చెఫ్!

ఇక ఆస్కార్ గెలవడంతో కీరవాణి, చంద్రబోస్ ని పలువురు ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కీరవాణిని సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశాడు. కీరవాణి ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం వర్మనే. RGV తీసిన క్షణం క్షణం సినిమాకి కీరవాణిని సెలెక్ట్ చేసుకోవడంతో అప్పటి వరకు తనని పక్కన పెట్టేసిన ఎంతో మంది దర్శకనిర్మాతలు కీరవాణిని తమ సినిమాలకు ఒకే చేశారు. అయితే వర్మ, కీరవాణికి క్షణం క్షణం సినిమా ఆఫర్ ఇవ్వడం వెనుక ఒక కథ ఉందట. ఆ విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

తన మొదటి సినిమా శివ ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకి మొదట సంగీత దర్శకుడిగా కీరవాణిని RGV సెలెక్ట్ చేశాడట. అయితే ఆ సినిమాకి తను కొత్త వాడు మాత్రమే కాకుండా మిగతా టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్ళనే తీసుకోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ ని అయినా పేరు ఉన్న వాళ్ళని తీసుకుందామని కొందరు బలవంతం చేయడంతో ఇళయరాజా శివ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కీరవాణికి ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి తన రెండో సినిమా క్షణం క్షణంకి పిలిచి మరి అవకాశం ఇచ్చాడట.