RGV – Keeravani : ఎవరి మాట వినని వర్మ.. కీరవాణి మాట విని సినిమా క్లైమాక్స్ మార్చేశాడు..

తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్లే రామ్ గోపాల్ వర్మ.. కీరవాణి మాట విని సినిమా క్లైమాక్స్ మార్చేశాడట. అది ఏ సినిమానో తెలుసా?

RGV – Keeravani : ఎవరి మాట వినని వర్మ.. కీరవాణి మాట విని సినిమా క్లైమాక్స్ మార్చేశాడు..

Keeravani share memory about Ram Gopal Varma Kshana Kshanam

RGV – Keeravani : రాజమౌళి తెరకెక్కించిన RRR లోని నాటు నాటు (Naatu Naatu) పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఈ పాటకి ఎం ఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్ అందించగా కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ డాన్స్ కోరియోగ్రఫీ చేయగా ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులు ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఆస్కార్ ని కీరవాణి, చంద్రబోస్ అందుకొని సంచలనం సృష్టించారు.

RGV – Keeravani : కీరవాణితో వర్మ ఆ బ్లాక్ బస్టర్ సినిమా చేయాల్సి ఉంది.. కానీ ఏమైంది!

ఆస్కార్ గెలవడంతో కీరవాణి, చంద్రబోస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి కీరవాణిని ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. వర్మ క్షణం క్షణం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణికి అవకాశం ఇచ్చి తను ఇండస్ట్రీలో నిలబడేలా చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఆ మూవీ సమయంలో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. వెంకటేష్, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో పరేష్ రావల్ విలన్ గా నటించాడు. అయితే వర్మ రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమా చివరిలో పరేష్ పాత్ర చనిపోతుందట.

Nani30 : నాని సినిమాలోకి శృతిహాసన్ ఎంట్రీ.. మరి మృణాల్ ఠాకూర్?

ఆ ఎండింగ్ కీరవాణికి నచ్చలేదు. పరేష్ పాత్ర చనిపోకుండా జైలుకి వెళితే బాగుంటుందని చెప్పాడట. ఎవరి మాట వినని వర్మ కీరవాణి చెప్పిన మాట విని క్లైమాక్స్ మార్చేశాడు. దీంతో కీరవాణి షాక్ కి గురయ్యాడట. వర్మ క్షణం క్షణంకి అవకాశం ఇవ్వకపోతే కీరవాణి వాడు అనేవాడు ఇండస్ట్రీలో ఉండేవాడు కాదు. అటువంటి వాడి మాట శివ వంటి హిట్ కొట్టిన వర్మ లెక్క చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడట. కాగా ఇప్పుడు నాటు నాటుకి వచ్చింది తనకి రెండో ఆస్కార్ అని, మొదటి ఆస్కార్ RGV తనకి అవకాశం ఇవ్వడమని చెప్పుకొచ్చాడు.