Ippudu Kaka Inkeppudu: బెడ్‌రూమ్ సన్నివేశాలకు కీర్తనలు.. దర్శకుడి క్లారిటీ!

ఈ మధ్య కాలంలో సినిమాలలో సన్నివేశాలపై దుమారం రేగడం సర్వసాధారణంగా మారిపోయింది. సినిమాలు, అందులోని పాటలు, మాటలపై వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే చాలాసార్లు విన్నాం. కానీ ఇన్ని తెలిసినా ఓ దర్శకుడు హీరో, హీరోయిన్స్ బెడ్ రూమ్ సన్నివేశాలకు ఏకంగా శ్రీవారి కీర్తనలు పెట్టేశాడు.

Ippudu Kaka Inkeppudu: బెడ్‌రూమ్ సన్నివేశాలకు కీర్తనలు.. దర్శకుడి క్లారిటీ!

Ippudu Kaka Inkeppudu

Ippudu Kaka Inkeppudu: ఈ మధ్య కాలంలో సినిమాలలో సన్నివేశాలపై దుమారం రేగడం సర్వసాధారణంగా మారిపోయింది. దీన్ని ప్రచారానికి వాడుకోవడం కూడా దర్శక, నిర్మాతలకు అలవాటుగా మారిందనే విమర్శలు షరా మామూలే. సినిమాలు, అందులోని పాటలు, మాటలపై వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పటికే చాలాసార్లు విన్నాం. కానీ ఇన్ని తెలిసినా ఓ దర్శకుడు హీరో, హీరోయిన్స్ బెడ్ రూమ్ సన్నివేశాలకు ఏకంగా శ్రీవారి కీర్తనలు పెట్టేశాడు.

యుగంధర్ అనే కొత్త దర్శకుడు ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుండగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే.. ఈ ట్రైలర్ లో హీరో, హీరోయిన్స్ మధ్య బెడ్ రూమ్ సీన్స్ వస్తున్నపుడు ఆదిశంకరాచార్యులు రాసిన భజగోవిందం అనే బ్యాగ్రౌండ్ స్కోర్ వాడుకున్నారు. దీంతో ఇది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఫైనల్ గా హిందూ సంఘాలు, కొందరి నేతల ఫిర్యాదులతో 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు.

అయితే.. ఈ వివాదంపై దర్శకుడు యుగంధర్ మీడియా ముఖంగా క్షమాపణలు కోరుతూ క్లారిటీ ఇచ్చాడు. ఇది తాను కావాలని చేసిన తప్పిదం కాదని.. అనుకోకుండా జరిగిందని.. తెలిశాక కీర్తనలు తొలగించామని చెప్పారు. భజ గోవిందం అనే పదాలు టైటిల్ సాంగ్ లో ఉన్నాయని.. ఆ సాంగ్ సక్సెస్ కావడంతో అదే పాటను ట్రైలర్ తెచ్చి పెట్టామని.. కానీ ఆ పదాలు వచ్చే సమయంలోనే ట్రైలర్ లో బెడ్ రూమ్స్ సీన్స్ రావడం వివాదంగా మారిందని చెప్పారు.

బహుశా దర్శకుడిగా అనుభవం లేకపోవడంతోనే ఈ తప్పు జరిగిందని.. ఇది ఎవరిని బాధ పెట్టాలని చేసిన ఉద్దేశ్యం కాదన్నారు. ఇక హీరో, హీరోయిన్స్ ను తులసీ మాత, శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చిన డైలాగ్స్ కూడా మ్యూట్ చేసినట్లు కూడా దర్శకుడు యుగంధర్ చెప్పాడు. అయితే.. జరగాల్సిన వివాదం.. రావాల్సిన ప్రచారం కూడా ఇప్పటికే వచ్చేసింది.