మహానటికి పెళ్లా.. బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పేస్తుందా.. మరి సినిమాలో!!

మహానటికి పెళ్లా.. బ్యాచిలర్ లైఫ్‌కి బై బై చెప్పేస్తుందా.. మరి సినిమాలో!!

Keerthi Suresh: మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తి సురేశ్.. పెళ్లి కూతురు అవనుందట. రీల్ లైఫ్ లో కాదండీ.. రియల్ లైఫ్‌లో. బేసిక్‌గా మలయాళం నుంచి వచ్చిన అమ్మడికి టాలీవుడ్ పెద్ద హీరోలతో సినిమాలు రావడంతో అంతా తెలుగమ్మాయే అనుకున్నాం. పైగా ఆమె చేసింది మహానటి రోల్ కదా. మనమ్మాయే అనుకుని అడాప్ట్ చేసుకున్న వాళ్లు కొందరుంటే.. క్యూట్ స్మైల్‌, మెస్మరైజ్ చేసే కళ్లు, మేటిగా మెప్పించగల నటన మరి కొంతమంది అభిమానులను సంపాదించేలా చేశాయి.

తెలుగు కంటే తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసిన కీర్తి.. గురించి అక్కడే చర్చలు బాగా వినిపిస్తున్నాయి. పెళ్లి సంబంధాలు చూసేంత వరకూ కాదు.. దాదాపు పెళ్లి ఖాయం అయిపోయినట్లే అంటున్నాయి సినీ వర్గాలు. ఏ లవ్ మ్యారేజో కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటు వేసిన కీర్తికి ఓ యువ వ్యాపారవేత్తను ఇచ్చి కట్టబెట్టనున్నారు.

ఇక్కడ వచ్చిన చిక్కల్లా.. 2021 ఏప్రిల్‌లోగా పెళ్లి జరిగిపోవాలని పెద్దలు అనడమే. కీర్తి మాత్రం సినిమా కమిట్మెంట్స్ కారణంగా కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందని చెప్తుందట. అటు వరుడి తరపు మాట ఇచ్చేసి ఇటు కీర్తిని ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక సతమతమవుతున్నారట కుటుంబ సభ్యులు. మన హీరోయిన్ మాట గెలుస్తుందో లేదంటే కూతురి పాత్రలో ఒదిగిపోయి పెద్దలు చెప్పిన ముహూర్తానికే పెళ్లి చేసుకుంటుందో వెయిట్ చేసి చూడాలి.

ఒకవేళ అలాగే జరిగితే ఏప్రిల్ తర్వాత నుంచి శ్రీమతి కీర్తి సురేష్ సినిమాల్లో కనిపించడం కష్టమే. ఎందుకంటే సినిమా కమిట్మెంట్స్ అయిపోయాకే పెళ్లి చేసుకుంటానని చెప్తుందంటే తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాననే అనుకుంటుంది కాబోలు.

రీసెంట్ గా రిలీజ్ అయిన మిస్ ఇండియా తర్వాత ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉంది. తెలుగులో ‘గుడ్‌లక్‌ సఖీ’ ‘రంగ్‌దే’ ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది.