మిస్ ఇండియాగా కీర్తి సురేష్ - టైటిల్ టీజర్ రిలీజ్

మిస్ ఇండియాగా కీర్తి సురేష్ – టైటిల్ టీజర్ రిలీజ్

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు 'మిస్ ఇండియా' టైటిల్ ఖరారు..

మిస్ ఇండియాగా కీర్తి సురేష్ – టైటిల్ టీజర్ రిలీజ్

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు ‘మిస్ ఇండియా’ టైటిల్ ఖరారు..

మహానటి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాకు ‘మిస్ ఇండియా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్‌లో కీర్తి సురేష్ మేకోవర్  బాగుంది. తను మోడరన్ యువతిగా కనిపించింది.

మహానటి సినిమాకు ఈ సినిమాకు కీర్తి క్యారెక్టర్‌లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరించారు. మహిళా ప్రాధాన్యమున్న మిస్ ఇండియాలో కీర్తి సురేష్ నటన ఆకట్టుకుంటుందని, ఆమె సినిమాలో మిస్ ఇండియానా కాదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని దర్శక, నిర్మాతలు తెలిపారు.

Read Also : హీరో పెద్ద మనసు : అమెజాన్ సంరక్షణకు రూ.36 కోట్లు విరాళం..

జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నరేష్, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, నదియా, కమల్ కామరాజు తదితరులు నటిస్తున్న మిస్ ఇండియా త్వరలో విడుదల కానుంది. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : డానీ సాంచేజ్ లోపెజ్, వంశీ.పి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : సాహి సురేష్. 

Image

×