కొలవెరి కుర్రాడితో కీర్తి సురేష్ పెళ్లి!

కొలవెరి కుర్రాడితో కీర్తి సురేష్ పెళ్లి!

Keerthy Suresh and Anirudh: ‘మహానటి’ తో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అది కూడా ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో అట..

ఏంటా సంగతి అని వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ కంపోజర్, కొలవెరి కుర్రాడు అనిరుధ్, కీర్తి సురేష్ తో సన్నిహితంగా ఉంటున్నాడట. అనిరుధ్ బర్త్‌డే అక్టోబర్ 16 (1990), కీర్తి సురేష్ పుట్టినరోజు అక్టోబర్ 17 (1992). లాస్ట్ ఇయర్ చెన్నైలో వీరిద్దరూ బర్త్‌డేస్ సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు తీసుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ఆ ఫొటోలనే ఆధారాలుగా చూపిస్తూ.. కీర్తి, అనిరుధ్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు అల్లేస్తున్నారు. ఇంకో హైలెట్ ఏంటంటే కీర్తి, అనిరుధ్ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కీర్తి సురేష్ మ్యారేజ్ గురించి ఇప్పటికే పలు వార్తలొచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటి అనుకోవాలా, లేక నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి నిజంగానే సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఏమైనా ఉందా అనేది తెలియాలంటే కీర్తి నోరు మెదపాల్సిందే.

Keerthy Suresh and Anirudh