Keerthy Suresh: స్పెయిన్‌లో కీర్తి చిల్‌అవుట్.. గ్లామర్ ట్రీట్!

కీర్తి సురేష్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మహానటి మూవీ మాత్రమే. అంతగా ఆ సినిమా కీర్తి మీద ముద్ర వేసింది. మహానటి సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా.. ఆ సినిమా..

10TV Telugu News

Keerthy Suresh: కీర్తి సురేష్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మహానటి మూవీ మాత్రమే. అంతగా ఆ సినిమా కీర్తి మీద ముద్ర వేసింది. మహానటి సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతున్నా.. ఆ సినిమా తర్వాత కీర్తి అరడజను సినిమాలు చేసినా ఇంతవరకు మహానటిని మరిపించే మూవీని మాత్రం అందించలేకపోయింది కీర్తి సురేశ్‌. చివరికి మహానటి దారిలోనే మరిన్ని ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసినా కూడా పెద్దగా కలసి రాలేదు. ఆ సినిమాలు కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోయింది.

Sooryavanshi: హిట్ మెషీన్ అక్కీ.. సూర్యవన్షీ నయా రికార్డ్!

ఇక, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కాస్త పక్కకి నెట్టిన కీర్తి ఇప్పుడు స్టార్ హీరోల పక్కన ఆడిపాడుతూనే.. సీనియర్ హీరోలకు చెల్లి పాత్రలతో హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిస్తుండగా మెగాస్టార్ చిరు చెల్లిగా భోళాశంకర్ లో కనిపించనుంది. విమెన్ సెంట్రిక్ గా గుడ్ లక్ సఖి సినిమా కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.

Naina Ganguly: నైనా అందాల అరాచకం ఆపదగునా!

కాగా, మహేష్ సర్కారు వారి పాట ముమ్మర షూటింగ్ లో ఉండగా తాజాగా స్పెయిన్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ గడిపిన క్షణాలను కీర్తి సురేష్ అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ మోడ్రన్ లుక్ లో కీర్తి అలా చిల్ అవుట్ అవుతుంటే ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. దాదాపుగా కీర్తి ఇలా బయట మోడ్రన్ లుక్ లో కనిపించడం చాలా అరుదు. అయితే.. స్పెయిన్ గాలి ప్రభావమో ఏమో కానీ కీర్తి చిల్ అవుతూ ఆస్వాదించి దాన్నే ఇలా నెట్టింట పెట్టింది.

×