Keerthy Suresh: నాని పాటకు కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ మూవీ "దసరా". ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్.. 'ధూమ్ ధామ్ ధోస్థాన్' సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ పాట చాలా కాలంగా యూట్యూబ్ ట్రెండ్స్ లిస్ట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో నాని మాస్ స్టెప్స్‌లు వేసి ఇరగదీసాడు.

Keerthy Suresh: నాని పాటకు కీర్తి సురేష్ మాస్ స్టెప్పులు..

Keerthy Suresh Mass Steps for Nani Dasara Movie Song

Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ మూవీ “దసరా”. ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్.. ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. దసరా స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ పాట చాలా కాలంగా యూట్యూబ్ ట్రెండ్స్ లిస్ట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో నాని మాస్ స్టెప్స్‌లు వేసి ఇరగదీసాడు.

Keerthy Suresh: వైట్ అవుట్‌ఫిట్‌లో హీటెక్కిస్తున్న కీర్తి సురేష్..

అయితే ఇప్పుడు హీరోయిన్ ‘కీర్తి సురేష్’ వంతు వచ్చింది. ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ధూమ్ ధామ్ ధోస్థాన్ అంటూ నాని వేసిన స్టెప్పులను కీర్తి లుంగీ కట్టి ఆ మాస్ స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా కోసం నాని చేసిన మేకోవర్ అయితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్‌ రికార్డు స్థాయిలో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.