Dasara Teaser: దసరా టీజర్‌లో ఇది గమనించారా.. ఎందుకంటారు..?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Dasara Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ టీజర్ కట్ ఉండటంతో ప్రేక్షకులు నానిని ఇలాంటి పాత్రలో ఇప్పటివరకు చూడలేదని ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ టీజర్‌ను చూసిన ప్రేక్షకులు ఓ విషయంలో మాత్రం నిరాశకు లోనవుతున్నారు. ఈ టీజర్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ ఎక్కడా కనిపించకపోవడమే వారి నిరాశకు కారణంగా తెలుస్తోంది. ఇలాంటి మూవీ టీజర్‌లో హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేయకుండా కేవలం హీరోనే చూపెట్టడం ఏమిటని కీర్తి సురేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Dasara Movie : నాని దసరా రెండు భాగాలుగా రాబోతోందా?
అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ డీగ్లామర్ రోల్‌లో నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన ప్రత్యేక టీజర్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె పాత్రను ఈ టీజర్‌లో రివీల్ చేయలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కీర్తి సురేష్ ఈ దసరా టీజర్‌లో కనిపించి ఉంటే, మరింత క్రేజ్ కలిగేదని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.