ఆది పినిశెట్టికి జోడీగా కీర్తిసురేష్‌

  • Edited By: veegamteam , April 27, 2019 / 11:49 AM IST
ఆది పినిశెట్టికి జోడీగా కీర్తిసురేష్‌

న‌గేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్రధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇప్పటికే నాలుగో భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. 

ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండ‌గా త‌ను వెడ్స్ మ‌ను ఫేమ్ చిరంత‌న్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీక‌ర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌, పూణేల్లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇక అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సెప్టెంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శక నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.