కరోనాతో మోహన్ లాల్ మరణించాడంటూ ఫేక్ న్యూస్.. రంగంలోకి దిగిన పోలీసులు..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : April 5, 2020 / 10:09 AM IST
కరోనాతో మోహన్ లాల్ మరణించాడంటూ ఫేక్ న్యూస్.. రంగంలోకి దిగిన పోలీసులు..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది..

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో ఫేక్ న్యూస్‌ స్ప్రెడ్ చేసి ప్ర‌జ‌ల‌ను భయాందోళ‌న‌ల‌కు గురి చేయ‌వ‌ద్దంటూ ప్ర‌భుత్వాలు కోరుతున్నా కానీ.. కొందరు ఆకతాయిలు ఆగట్లేదు. ఏదో ఒక ఫేక్ న్యూస్  క్రియేట్ చేస్తూనే ఉన్నారు.

అలాంటి వారిపై ప్ర‌భుత్వాలు కూడా సీరియ‌స్‌గా చ‌ర్య‌లు తీసుకోనున్నామని హెచ్చరికలు జారీ చేశాయి. కేర‌ళ‌లో ఇటీవ‌ల ఓ ఆక‌తాయి మలయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కరోనా మహమ్మారి సోకి చ‌నిపోయాడంటూ ఓ ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేశాడు.

ఈ న్యూస్ చూసిన మోహ‌న్‌లాల్ అభిమానులు ఆగ్ర‌హానికి గురై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జరుపుతున్నారు. మరో వైపు మోహన్ లాల్ అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా ఆ వార్త సృష్టించింది ఎవరనేది కనిపెట్టే పనిలో ఉన్నారు.

Read Also : లాక్‌డౌన్‌లో స్నేహితుడితో కలిసి జాలీరైడ్.. యాక్సిడెంట్ చేసి పరారీ..