Mollywood: చిన్న సినిమాలకు అండగా.. ఓటీటీ రంగంలోకి కేరళ ప్రభుత్వం!

కేరళ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం సొంతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది..

Mollywood: చిన్న సినిమాలకు అండగా.. ఓటీటీ రంగంలోకి కేరళ ప్రభుత్వం!

Kerala Government Plans To Ott Platform For Film Industry

Mollywood: కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. షూటింగ్స్ లేవు, థియేటర్లు మూతపడ్డాయి. నానా ఇబ్బందులు పడి.. తిరిగి కోలుకోబోతున్నాం అనుకుంటుండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సెకండ్ వేవ్ దెబ్బ మీద దెబ్బ కొట్టింది.

మోహన్ లాల్ వంటి స్టార్ హీరో నటించిన ‘దృశ్యం 2’ లాంటి కొన్ని పెద్ద సినిమాలు సైతం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లనే నమ్ముకోవడంతో.. చిన్న నిర్మాతలు వడ్డీల బాధ భరించలేక వచ్చినకాడికి చాలు అనుకుని ఓటీటీలవైపు చూస్తున్నారు. ఇప్పుడు వారికి అండగా నిలబడడానికి కేరళ ప్రభుత్వం ముందుకొచ్చింది.

 

Drishyam 2

ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టం కాబట్టి, చిన్న సినిమాల నిర్మాతల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం చిన్న సినిమాల కోసం సొంతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. పెద్ద సినిమాలైతే థియేట్రికల్ రిలీజ్ అయ్యాకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. అసలు థియేటర్లే దొరకని చిన్న సినిమాల పరిస్థితి ఏంటి?..

Mollywood

ఇప్పటికే పాండమిక్ టైంలో మలయాళ పరిశ్రమకు దాదాపు 600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చెయ్యడానికి త్వరలోనే ప్రభుత్వం ఓ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చెయ్యబోతుందని కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్ తెలిపారు. కేరళ మాదిరిగానే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిన్న నిర్మాతలను ఆదుకోవడానికి ముందుకొస్తే బాగుంటుంది అంటున్నారు ట్రేడ్ వర్గాలవారు.