Ketika Sharma: రామ్‌తో ఛాన్స్.. కేతికకు మంచి రోజులొచ్చాయా?

అనుష్క, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్స్ పెద్దగా స్వింగులో లేరు. పూజా హెగ్డే, రష్మిక మందనా లాంటి వారు ఫుల్ బిజీగా ఉన్నారు.. దానికి తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పాల్సి..

10TV Telugu News

Ketika Sharma: అనుష్క, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్స్ పెద్దగా స్వింగులో లేరు. పూజా హెగ్డే, రష్మిక మందనా లాంటి వారు ఫుల్ బిజీగా ఉన్నారు.. దానికి తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే ఓ మోస్తరు సినిమాలను ప్లాన్ చేసే మేకర్స్ కొత్త హీరోయిన్స్ వేటలో ఉంటున్నారు. అందునా కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ఉన్నా పెద్దగా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ మీద కూడా ఓ కన్నేసి ఉంచుతున్నారు. అందుకే అలాంటి హీరోయిన్స్ కు ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తున్నట్లుగా కనిపిస్తుంది.

Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?

సోషల్ మీడియా, యూట్యూబ్, మోడలింగ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఢిల్లీ భామ కేతికా శర్మ రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంది. దర్శకుడు పూరి తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో నటించింది. కానీ.. కరోనా ప్రభావంతో ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇప్పుడు భారీ సినిమాల మధ్యన రొమాంటిక్ కోసం మంచి ప్లేస్ దొరకనేలేదు. దీంతో కేతికాకి కూడా అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు కేతికా యంగ్ హీరో రామ్ పోతినేనితో ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

రామ్ కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి హీరోయిన్స్ కు అవకాశాలిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి లింగుస్వామి సినిమాతో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమా కోసం కేతికా శర్మను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా దర్శకుడెవరు.. పూర్తి వివరాలేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు కానీ.. ఇది కూడా రామ్ కెరీర్ లో మరో ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కాగా, కేతికా నటించిన రొమాంటిక్ సినిమా కూడా త్వరలోనే విడుదల చేసేందుకు పూరి టీం సన్నాహాలు చేస్తుంది.