Ketika Sharma : మా అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లే.. నేనేమో ఇలా.. అందుకే సినిమాలో డాక్టర్ క్యారెక్టర్..

కేతిక శర్మ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాను. మా అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లే. నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ నాకేమో............

Ketika Sharma : మా అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లే.. నేనేమో ఇలా.. అందుకే సినిమాలో డాక్టర్ క్యారెక్టర్..

Ketika Sharma reveals her parents dream about her

Ketika Sharma :  రొమాంటిక్ సినిమాతో కుర్రకారు గుండెల్లో తిష్టవేసుకుంది హీరోయిన్ కేతిక శర్మ. రొమాంటిక్ సినిమాలో రొమాంటిక్ గా కవ్వింతలు పెట్టి, సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా తన హాట్ హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది కేతిక శర్మ. రొమాంటిక్ తర్వాత లక్ష్య సినిమాలో చాలా మాములు పాత్ర చేసినా త్వరలో రంగరంగ వైభవంగా సినిమాతో సూపర్ ఫన్ క్యారెక్టర్ తో రాబోతుంది.

వైష్ణవ తేజ్, కేతిక శర్మ జంటగా కొత్త దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కేతిక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది.

Mahesh Babu : సితారతో కలిసి డ్యాన్స్ షోలో మెరిసిన మహేష్.. ఫుల్ ఖుషి అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

కేతిక శర్మ మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాను. మా అమ్మనాన్న ఇద్దరూ డాక్టర్లే. నన్ను కూడా డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ నాకేమో యాక్టింగ్ అంటే ఇష్టం. హీరోయిన్ గా సినిమాల్లో కనపడాలని అనుకునేదాన్ని. మా పేరెంట్స్ కి చెప్తే ఒప్పుకున్నారు. నన్ను సపోర్ట్ చేశారు. నన్ను డాక్టర్ గా చూడాలనే వాళ్ళ కోరిక నెరవేరలేదు. ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ పాత్రతో ఇలా రీల్ లైఫ్ లో వాళ్ళ కోరిక నెరవేర్చాను అనుకుంటున్నాను” అని తెలిపింది.