KGF 2 teaser: ఏది కావాలో అదే.. పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్‌ఫుల్

KGF 2 teaser: ఏది కావాలో అదే.. పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్‌ఫుల్

KGF 2 teaser: కేజీఎఫ్ 2లో ఎంతగానైతే పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఎక్స్‌పర్ట్ చేశారో అదే రేంజ్ లో రిలీజైంది. పార్ట్ 2లో కూడా తల్లి సెంటిమెంట్ ను బలంగా కనిపించేలా రెడీ చేసినట్లుంది. టీజర్ స్టార్టింగ్ లో ఒక్క మాట కోసం కట్టుబడి ఉన్న వ్యక్తి గురించి అని మొదలుపెట్టి చివర్లో తల్లి చేతిలో చెయ్యేసి మాట చెప్పే సీన్ వరకూ అత్యద్భుతంగా అనిపించింది.

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి ప్రధాన తారాగణంపై ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్లు సీనియర్లతో కనిపించేలా రెడీ చేసింది. ఈ మేరకు క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమాకు సంబంధించి యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేసింది సినిమా యూనిట్.

హీరో ఎలివేషన్ సీన్స్ ఏ మాత్రం పార్ట్ 1కు తీసిపోకుండా జరుగుతుండగా.. తొలి పార్ట్ లో చెప్పినట్లుగానే వాయీస్ ఓవర్ తోనే సెకండ్ పార్ట్ కూడా అలరించనుంది. హీరోయిన్ సెకండ్ పార్ట్ లో మరింత అందంగా, అధీరాగా సంజయ్‌దత్, గన్ ఫైరింగ్ సీన్లు ఆద్యంతం రసవత్తరంగా అనిపించాయి. చిత్ర షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. జూలై 30నే కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక రోజు ముందుగానే నెట్టింట్లో లీక్ అయిన వీడియో కారణంగా ఒకరోజు ముందుగానే జనవరి7న దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్ర టీజర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.