KGF 2 : టీవీల్లోకి వచ్చేస్తున్న రాకీభాయ్.. 80 అడుగుల బ్యానర్‌తో భారీ వెల్కమ్ చెప్పిన శాటిలైట్ ఛానల్..

కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు భారీ మొత్తానికి కొనుక్కుంది. ఈ సినిమా ఆగ‌స్టు 21 (ఆదివారం) సాయంత్రం 5:30 గంట‌ల‌కు జీ తెలుగులో రానుందని ప్రకటించారు. ఇందుకు స్పెషల్ గా........

KGF 2 : టీవీల్లోకి వచ్చేస్తున్న రాకీభాయ్.. 80 అడుగుల బ్యానర్‌తో భారీ వెల్కమ్ చెప్పిన శాటిలైట్ ఛానల్..

kgf 2

KGF 2 :  యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 సినిమా ఏంథాటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల కలెక్షలని కలెక్ట్ చేసింది సినిమా. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమ స్థాయి మరో లెవెల్ కి పెరిగింది. ఇక ఓటీటీలోకి వచ్చాక కూడా సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 సినిమా టీవీల్లోకి రాబోతుంది.

Music Director Koti : విలన్ గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. సెకండ్ ఇన్నింగ్స్ షురూ..?

కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2 శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు భారీ మొత్తానికి కొనుక్కుంది. ఈ సినిమా ఆగ‌స్టు 21 (ఆదివారం) సాయంత్రం 5:30 గంట‌ల‌కు జీ తెలుగులో రానుందని ప్రకటించారు. ఇందుకు స్పెషల్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు సదరు ఛానల్ నిర్వాహకులు. హైదరాబాద్ లో స‌ద‌రు ఛాన‌ల్ కేజీఎఫ్ చాఫ్ట‌ర్‌ 2 సినిమాకు సంబంధించిన 80 అడుగుల బ్యాన‌ర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో యశ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో టీఆర్పీ రికార్డులని సృష్టిస్తుందో చూడాలి.