Krishna G Rao: రాఖీ భాయ్ పవర్‌ను పరిచయం చేసిన ‘కేజీఎఫ్’ నటుడి కన్నుమూత

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా దర్శకడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా, ఈ సినిమాతో హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కేజీఎఫ్ సినిమాలో నటించిన కృష్ణ జి. రావు అనారోగ్య కారణాలతో బుధవారం కన్నుమూశారు.

Krishna G Rao: రాఖీ భాయ్ పవర్‌ను పరిచయం చేసిన ‘కేజీఎఫ్’ నటుడి కన్నుమూత

KGF Actor Krishna G Rao Passed Away

Krishna G Rao: కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా దర్శకడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా, ఈ సినిమాతో హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉన్న కేజీఎప్ సినిమాలను చూస్తూ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Krishnaji Rao : కేజీఎఫ్ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత ఎవరో తెలుసా??

అయితే కేజీఎఫ్ అభిమానులకు ఓ చేదు వార్తను కన్నడ సినీ ఇండస్ట్రీ తెలిపింది. కేజీఎఫ్ సినిమాలో నటించిన కృష్ణ జి. రావు అనారోగ్య కారణాలతో బుధవారం కన్నుమూశారు. కేజీఎఫ్ తొలి భాగంలో హీరో విలన్లను చితక్కొట్టే ఫైట్‌ సీన్ ముందు వచ్చే ఓ అంధుడి పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ అంధుడి పాత్రలో నటించింది మరెవరో కాదు.. కన్నడ నటుడు కృష్ణ జి రావు. కేజీఎఫ్ సినిమాలో ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర అని చెప్పాలి.

KGF Actor Harish Rai : కేజీయఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక.. ఆదుకునేవాళ్లే లేరా..?

కేజీఎఫ్ చిత్రంతో వచ్చిన గుర్తింపుతో ఆయనకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల కృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే ఇలా ఆయన హఠాత్తుగా మరణించడంతో ఇప్పుడు ఆ సినిమా పరిస్థితి అయోమయంగా మారింది. కాగా కృష్ణ జి రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌, కథా రచయితగా పలు సినిమాల్లో పని చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు కన్నడ సినీ తారలు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు.