KGFChapter2: కేజీఎఫ్-2 రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమా తర్వాత హీరో యశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

KGFChapter2: కేజీఎఫ్-2 రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్

Kgf

KGFChapter2: ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సినిమా కేజీఎఫ్‌. ఈ సినిమా తర్వాత హీరో యశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోగా ఈసినిమా సీక్వెల్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేజీఎఫ్-2 కొత్త రిలీజ్​ డేట్​ను యూనిట్ ప్రకటించింది. 2022 ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కన్నడ సంవత్సరాది ఏప్రిల్ 13 కాగా.. ఆ మర్నాడే గురువారం ‘కేజీఎఫ్ 2’ను వరల్డ్ వైడ్ విడుదల చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ అనేది లేకపోయి ఉంటే, జూలై 16న సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల అవ్వాల్సి ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సీక్వల్‌గా కేజీఎఫ్-2 తెరకెక్కుతుండగా.. ఈ సినిమాపై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

ఈ సినిమా శాటిలైట్స్‌ హక్కులను జీ 5 సంస్థ కొనుగోలు చేసినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. భారీ ధరకు ఈ శాటిలైట్స్ హక్కులు అమ్ముడయ్యాయి. సినిమా విషయానికొస్తే శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. రవినా టండన్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడగానే ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకు కారణం.. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నిల్ దర్శకత్వంలోనే ప్రభాస్ హీరోగా సలార్ వస్తుండగా.. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 22న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే, కేజీఎఫ్ సినిమా ఏప్రిల్‌లోనే విడుదలైతే, సలార్ కచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ప్రభాస్ సినిమా ఎప్పుడా? అని ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది.