KGF 2: RRRకు దీటుగా 10,000+ స్క్రీన్లలో KGF-2 రిలీజ్

RRR రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే.. KGF2 బడ్జెట్ రూ. 150 కోట్లు కావడం విశేషం.

KGF 2: RRRకు దీటుగా 10,000+ స్క్రీన్లలో KGF-2 రిలీజ్

Rrr Kgf 2

KGF 2: RRR రిలీజ్ ను దేశం మొత్తం చూసింది. బాహుబలి2 స్థాయిని మించి.. థియేటర్లు, టికెట్ రేట్లతో రిలీజైన ఈ రాజమౌళి వండర్.. బాక్సాఫీస్ ను కొల్లగొట్టింది. భారీగా వసూళ్లు సాధించి ఇండియాలో టాప్ 2 గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు అదే స్థాయిలో యశ్- ప్రశాంత్ నీల్ ల KGF Chapter -2 రిలీజ్ కు రెడీ అయింది.

Read This : 6 Wickets In 6 Balls : 6 బంతుల్లో 6 వికెట్లు.. క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీస్ అయిన RRR, KGF 2లను కంపేర్ చేస్తూ బయటకొస్తున్న ‘రిలీజ్ డీటెయిల్స్’ ఇప్పుడు ఫ్యాన్స్ ను ఔరా అనిపిస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 11000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. కే జీ ఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా 10వేల పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.

RRR అమెరికాలో1150 పైగా లొకేషన్స్ లో 2వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. KGF 2..అమెరికాలో 600 లోకేషన్స్ లో దాదాపు 1100 ప్లస్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.
RRR…యునైటెడ్ కింగ్డమ్ లో 1100 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. KGF2..యునైటెడ్ కింగ్డమ్ లో 400 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.
RRR…ఆస్ట్రేలియా, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, థాయిలాండ్, జపాన్ లు ఇంకొన్ని ప్రాంతాల్లో కలుపుకొని 1500 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. KGF2…ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్, న్యూజిలాండ్ సింగపూర్ తో పాటు మరి కొన్ని ప్రాంతాలు కలుపుకొని 900 స్క్రీన్స్ వరకు రిలీజ్ కాబోతోంది.

RRR నార్త్ ఇండియాలో 4000 పైగా థియేటర్స్ రిలీజ్ అయ్యింది. KGF 2 ఉత్తర భారత దేశంలో 4400 ప్లస్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. KGF 2 దక్షిణ భారత దేశంలో 2600+ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

Read This : KGF: Chapter 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో RRR రికార్డులను బ్రేక్ చేసిన యష్..?!

RRR తమిళ్ నాడులో 400 థియేటర్స్ లో రిలీజ్ అయితే.. KGF2 తమిళ్ నాడులో 300థియేటర్స్ లో వస్తోంది.

RRR…కేరళ..250 థియేటర్స్ లో వస్తే.. KGF 2..కేరళలో 250 థియేటర్స్ లో స్క్రీనింగ్ కానుంది.

RRR..కర్ణాటక..350 థియేటర్స్ లో రిలీజ్ అయితే.. KGF2 750 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి RRR మూవీ.. 1500 పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. kGF 2 700 థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

థియేట్రికల్ బిజినెస్
ఆర్ ఆర్ ఆర్ థియేట్రికల్ బిజినెస్ రూ.451 కోట్లు చేసింది. కే జీ ఎఫ్ చాప్టర్ 2 థియేట్రికల్ బిజినెస్ రూ.345 కోట్లు చేసింది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా ఆర్ ఆర్ ఆర్ రూ.223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కేజీఎఫ్ చాప్టర్ 2 మొదటి రోజు 150 నుంచి 175 కోట్లు గ్రాస్ రావచ్చని ఎక్స్ పెక్ట్ చేస్తుందని ట్రేడ్ టాక్.

ఫైనల్ గా.. RRR రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కితే.. KGF2 బడ్జెట్ రూ. 150 కోట్లు కావడం విశేషం.