రెగ్యులర్ షూటింగ్‌లో కేజీఎఫ్ చాప్టర్- 2

కేజీఎఫ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, చాప్టర్-2 ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు..

  • Edited By: sekhar , May 14, 2019 / 07:22 AM IST
రెగ్యులర్ షూటింగ్‌లో కేజీఎఫ్ చాప్టర్- 2

కేజీఎఫ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, చాప్టర్-2 ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు..

కేజీఎఫ్.. దక్షిణాది సినీ పరిశ్రమలన్నిటి చూపు కన్నడ సినీ ఇండస్ట్రీ వైపు తలతిప్పి చూసేలా చేసిన సినిమా.. రాక్ స్టార్ యష్ లాంటి టాలెంటెడ్ హీరోని ప్రపంచ సినీ ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా.. వెండితెరపై మునుపెన్నడూ చూడని కోలార్ మైనింగ్ గనుల నేపథ్యాన్ని సినిమా ప్రేక్షకులకు చూపించిన సినిమా.. కన్నడ సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని రూ.100 కోట్ల కలెక్షన్స్ అనే మాటని నిజం చేసిన సినిమా.. కన్నడ, హిందీ, తెలుగు అండ్ తమిళ్‌లో రిలీజ్ అయిన కేజీఎఫ్, వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

కేజీఎఫ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, చాప్టర్-2 ని భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా రెండవ భాగంలో ఉంటాయట. కొందరు బాలీవుడ్ నటులు చాప్టర్-2లో క్రూషియల్ రోల్స్ చేస్తున్నారు.  ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో, హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న కేజీఎఫ్ చాప్టర్-2 షూటింగ్ బెంగుళూరులో జరుగుతుంది. తర్వాత మైసూర్, రామోజీ ఫిలింసిటీ వంటి ప్రాంతాల్లో షూట్ చెయ్యనున్నారు. సెప్టెంబర్ నాటికి కర్ణాటక, బళ్ళారి షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం సినిమా పూర్తవుతుందట. 2020లో కేజీఎఫ్ చాప్టర్-2 రిలీజ్ కానుంది.