KGF Chapter 2: ఆర్ఆర్ఆర్ తరువాత కేజీయఫ్ 2 కూడా లైన్ కట్టింది!

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటు మరో దక్షిణాది సినిమా కూడా ఈయేడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అదే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ చాప్టర్ 2.

KGF Chapter 2: ఆర్ఆర్ఆర్ తరువాత కేజీయఫ్ 2 కూడా లైన్ కట్టింది!

KGF Chapter 2 World Television Premiere Date

KGF Chapter 2: టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాను చూసేందుకు యావత్ దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని చూపారు. ఫలితంగా ఈ సినిమా మరోసారి రాజమౌళి స్టామినాను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చాటింది.

రికార్డులు బద్ధలు కొట్టిన KGF: Chapter 2

ఇక ఈ సినిమాతో పాటు మరో దక్షిణాది సినిమా కూడా ఈయేడు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అదే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ చాప్టర్ 2. రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ యాక్షన్ మూవీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. ఇక ఈ రెండు సినిమాలు ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఏకంగా మూడు భాషల్లో ఆర్ఆర్ఆర్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది.

KGF: Chapter 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో RRR రికార్డులను బ్రేక్ చేసిన యష్..?!

దీంతో కేజీయఫ్ చాప్టర్ 2 కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకుంది. కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని ఆగస్టు 21న సాయంత్రం 5.30 గంటలకు ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసేందుకు జీ తెలుగు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఒక వారం గ్యాప్ లో రెండు భారీ చిత్రాలు టెలివిజన్ లో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.