అమెరికాలో రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ సినిమా

యూఎస్‌ఏలో రీ-రీలీజ్ అవుతున్నమొట్టమొదటి ఇండియన్ సినిమా కె.జి.ఎఫ్. కావడం విశేషం.

  • Edited By: sekhar , January 31, 2019 / 11:15 AM IST
అమెరికాలో రికార్డ్ క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ సినిమా

యూఎస్‌ఏలో రీ-రీలీజ్ అవుతున్నమొట్టమొదటి ఇండియన్ సినిమా కె.జి.ఎఫ్. కావడం విశేషం.

కన్నడ రాక్ స్టార్ యశ్, శ్రినిధి శెట్టి జంటగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందిన కె.జి.ఎఫ్. మూవీ, డిసెంబర్ 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయ్యింది. కంటెంట్ మరీ కొత్తదేం కాకపోయినా, హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తూ, ఆడియన్స్ ఇంతకుముందెప్పుడూ స్ర్కీన్‌పై చూడని బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో, కన్నడతో సహా అన్ని చోట్లా, మౌత్‌టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. కె.జి.ఎఫ్. రూ. 100 కోట్లు వసూలు చేసిన కన్నడ సినిమాగానే కాక, మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది..

అమెరికాలో కె.జి.ఎఫ్. రీ-రిలీజ్ కాబోతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో, యూఎస్‌ఏలో రీ-రీలీజ్ అవుతున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా కె.జి.ఎఫ్. కావడం విశేషం. వచ్చే శుక్రవారం నుండి దాదాపు 35కి పైగా లొకేషన్లలో కె.జి.ఎఫ్.ని  రీ-రీలీజ్ చెయ్యబోతున్నారు. అక్కడ ఇప్పటికే, రూ.806K డాలర్లు కలెక్ట్ చేసిన కె.జి.ఎఫ్, తెలుగు, కన్నడలో 40 రోజులు పూర్తి చేసుకుని, 50 రోజుల వైపు పరుగులు తీస్తుంది.

వాచ్ సలాం రాకీభాయ్ సాంగ్…