Star Heroes Movies: కేజీఎఫ్ టెర్రర్.. అంతకుమించిన అంచనాలతో కొత్త సినిమాలు!

ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ ని చూసినకళ్లు.. కెజిఎఫ్ లాంటి మరో సినిమానే కోరుకుంటాయి. అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అంతకుమించిన యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేస్తాయి.

Star Heroes Movies: కేజీఎఫ్ టెర్రర్.. అంతకుమించిన అంచనాలతో కొత్త సినిమాలు!

Star Heroes Movies

Star Heroes Movies: ట్రిపుల్ఆర్, కెజిఎఫ్ ని చూసినకళ్లు.. కెజిఎఫ్ లాంటి మరో సినిమానే కోరుకుంటాయి. అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ అంతకుమించిన యాక్షన్ ని ఎక్స్ పెక్ట్ చేస్తాయి కానీ.. దానికి కాస్త తగ్గినా ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యి ఆ సినిమా మొహం చూడరన్నది మాత్రం గ్యారంటీ. అందుకే మహేష్, మెగాస్టార్ లాంటి హీరోలు జాగ్రత్త పడుతున్నారు. మరి కెజిఎఫ్ మిగతా సినిమాల మీద ఎంత ఎఫెక్ట్ పడిందో.. ఆ సినిమాలు సెట్ చేసిన మార్క్ ని రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో చూద్దాం.

Telugu Star Heroes: బాలీవుడ్‌కు తారక్-బన్నీ.. హాలీవుడ్‌కు ప్రభాస్!

ట్రిపుల్ఆర్ తో విజువల్ గ్రాండియర్ ని, మేకింగ్ ని, ఎక్స్ ట్రార్డినరీ టేకింగ్ ని చూసి సర్ ప్రైజ్ అయిన ఆడియన్స్.. అది మర్చిపోకముందే..కెజిఎఫ్ 2తో అంతకుమించిన టేకింగ్ ని, ఎంటర్ టైన్ మెంట్ యాక్షన్ ని చూపించి షాకిచ్చారు. ఈ రేంజ్ యాక్షన్ ని, ఎలివేషన్ ని గ్రాండియర్ ని చూసిన ఆడియన్స్.. అప్ కమింగ్ మూవీస్ లో కూడా ఇలాంటివే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఏమాత్రం అంచనాలకు తగ్గినా.. డిజాస్టర్ ఫేస్ చెయ్యాల్సి వస్తోంది. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు హీరోలు.

Star Heroes Income: హీరోల వందల కోట్ల సంపాదన.. డబ్బులన్నీ ఏం చేస్తున్నారో తెలుసా?

ఎంతకాదన్నా ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ సినిమాల ఎఫెక్ట్ అప్ కమింగ్ సినిమాల మీద గట్టిగానే పడింది. ఆడియన్స్ కూడా ఇదే రేంజ్ ఎలివేషన్ ని ఎక్స్ పెక్ట్ చెయ్యడంతో మిగిలిన సినిమాలు కూడా అదే గ్రాండ్ నెస్ ని మెయింటెన్ చెయ్యాల్సి వస్తోంది. దాంతో సర్కారు వారిపాట, ఆచార్య, లైగర్, హరిహరవీరమల్లు లాంటి పెద్ద సినిమాలు జాగ్రత్త పడుతున్నాయి.

Telugu Star Heroes: అసలే సమ్మర్.. వెకేషన్ మూడ్‌లో తెలుగు హీరోలు!

కెజిఎఫ్, ట్రిపుల్ఆర్ లాంటి గ్రాండ్ సక్సెస్ అయిన సినిమాల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఆచార్య. ఈ పెద్ద సినిమాల ఎఫెక్ట్ ని ఫేస్ చెయ్యబోతోంది ఆచార్య. మెగాస్టార్, మెగా వపర్ స్టార్ లాంటి హీరోలు ఉన్నా.. కాజల్, పూజాహెగ్డే లాంటి హీరోయిన్లతో గ్లామర్ ప్యాక్ చేసినా.. కొరటాల శివ లాంటి టాలెంటెడ్ స్టోరీ టెల్లర్ అయినా రిజల్ట్ విషయంలో టెన్షన్ పడుతున్నారు టీమ్.

Star Heroes Movies: కాలం చెల్లిన రొటీన్ సినిమా.. అష్టకష్టాలు పడుతున్న హీరోలు

క్యాచీ సాంగ్స్, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నా.. రిలీజ్ విషయంలో ఎంత కాదన్నా ట్రిపుల్ఆఱ్, కెజిఎఫ్ లాంటి సినిమాలతో ఆడియన్స్ ఆచార్యని కంపేర్ చేస్తారు. ఇప్పటికే కొన్ని సీన్స్ మళ్లీ షూట్ చేసి.. కొన్ని ఎలివేషన్ షాట్స్ మళ్లీ యాడ్ చేసి ఆచార్యని ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కించారు. మరి వచ్చే వారం రిలీజ్ అవుతున్న ఆచార్య.. అంచనాల్ని ఎలా అందుకుంటుందో చూడాలని అందరూ వెయిట్ చేస్తున్నారు.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

ఆచార్య తర్వాత రిలీజ్ అవుతున్న మరో సినిమా సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట. రెండేళ్ల కరోనా గ్యాప్ తరువాత రాబోతున్న ఈ సినిమా మీద ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నా కెజిఎఫ్, ట్రిపుల్ఆర్ ని చూసిన కళ్లతో మిగతా సినిమాలు చూడాలంటే కష్టమే. అయితే రెగ్యులర్ కమర్షియల్ లవ్ ట్రాక్ విత్ యాక్షన్ తో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

కీర్తి సురేష్-మహేష్ కాంబినేషన్ లో పరుశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో 40 నిమిషాలు కీర్తిసురేష్-మహేష్ లవ్ ట్రాక్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుందని హింట్ ఇచ్చింది టీమ్. అంతేకాదు.. మహేష్ అల్టిమేట్ కామెడీ ఎలివేషన్ ని కూడా గట్టిగానే ప్లాన్ చేశారు పరశురామ్. ఇప్పటికే లాస్ట్ సాంగ్ షూటింగ్ తో ప్యాకప్ చెప్పడానికి రెడీ అవుతున్న టీమ్.. మే 12న సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు.

Telugu Heroes: హిందీ ఆడియన్స్ కోసం నాటు స్టెప్పులకు సిద్ధమవుతున్న మన హీరోలు!

ఆల్రెడీ కళ్లు చెదిరే సక్సెస్ అందుకున్న కన్నడ సినిమా కెజిఎఫ్ ని చూసి పెద్ద సినిమాలు టెన్షన్ పడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న లైగర్ కూడా ఇదే రూట్ లో ఉంది. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న లైగర్ ని గ్రాండ్ గానే తెరకెక్కించారు.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

లైగర్ ని గ్రాండ్ గా తెరకెక్కించినా, అనన్య పాండే లాంటి బాలీవుడ్ హీరోయిన్ ని టాలీవుడ్ లో ఎంట్రీ ఇప్పిస్తున్నా, మైక్ టైసన్ లాంటి లెజెండరీ బాక్సర్ ని బరిలోకి దింపినా.. రిజల్ట్ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ ఫీలవుతున్నారు టీమ్. పూరీ జగన్ డైరెక్ట్ చేసిన ఈ లైగర్ మూవీ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ.. ఆగ్ లగా దేంగే అంటూ ఆడియన్స్ లో హైప్ పెంచుతున్నారు.

Star Heroins: హీరోలెందుకు.. ఆడియన్స్‌ని ధియేటర్లకు రప్పిస్తున్న హీరోయిన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. హిట్ ఫ్లాప్ తో సంబందం లేని క్రేజ్ పవన్ సొంతమైనా కూడా సినిమాలకు సక్సెస్ ఇచ్చే విషయంలో ఈ క్రేజ్ అంతగా వర్కవుట్ కాకపోవచ్చు. అదీ కాక ఈ సారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవ్లలో రిలీజ్ చేస్తున్న హరిహరవీరమల్లు విషయంలో కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ కెజిఎఫ్, ట్రిపుల్ ఆర్ సెట్ చేసిన ఎలివేషన్ ని ఓవర్ కమ్ చెయ్యకపోయినా.. కనీసం మ్యాచ్ చేసేలా ఉండాలని.. ఇప్పటినుంచే గట్టిగానే జాగ్రత్త పడుతున్నారు క్రిష్ అండ్ కో.