KGF2: కేజీయఫ్ 2 @ 400.. నాటౌట్! | KGF2 Corsses Rs.400 Crores In Hindi Belt

KGF2: కేజీయఫ్ 2 @ 400.. నాటౌట్!

కేజీయఫ్ చాప్టర్ 2.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన్ మార్క్ టేకింగ్‌తో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్...

KGF2: కేజీయఫ్ 2 @ 400.. నాటౌట్!

KGF2: కేజీయఫ్ చాప్టర్ 2.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన్ మార్క్ టేకింగ్‌తో పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఇక ఈ సినిమా సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్‌ను కూడా కట్టిపడేసింది. దీంతో ఈ సినిమా అక్కడ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబడుతూ దుమ్ములేపింది.

KGF2: దంగల్‌ను తొక్కేసిన కేజీయఫ్2.. బాలీవుడ్‌లో టాప్ రెండు మనవే!

ఇప్పటికే కేజీయఫ్ 2 చాలా రికార్డులను క్రియేట్ చేయగా, హిందీలో రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసి టాప్ 2 ప్లేస్‌ను కబ్జా చేసింది ఈ మూవీ. తాజాగా 23వ రోజున ఈ సినిమా వసూళ్లతో కేజీయఫ్ 2 హిందీ బెల్ట్‌లో ఏకంగా రూ.400 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో కేవలం బాహుబలి 2 మాత్రమే ఈ సినిమాకంటే ముందు వరుసలో ఉండటంతో సౌత్ సినిమాల సత్తా ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కేజీయఫ్. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్ల సాధించి దమ్ము లేపింది.

KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2

రాకింగ్ స్టార్ యశ్ తనదైన యాక్టింగ్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అందాల భామ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, రవి బస్రూర్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతున్న ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

×