KGF2 రికార్డుల మోత.. రామ్, భీమ్‌లను దాటేసిన రాఖీభాయ్!
థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. తనతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడని సినిమాతోనే కాదు, కలెక్షన్లతోనూ ప్రూవ్ చేశాడు. 100 కోట్ల బడ్జెట్ తో వచ్చి 11 వందల కోట్లకు టార్గెట్ పెట్టాడు.

KGF2: థియేటర్స్ లో స్పాట్ పెట్టాడు రాఖీభాయ్. తనతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడని సినిమాతోనే కాదు, కలెక్షన్లతోనూ ప్రూవ్ చేశాడు. 100 కోట్ల బడ్జెట్ తో వచ్చి 11 వందల కోట్లకు టార్గెట్ పెట్టాడు. రికార్డులు బ్రేక్ చేసుకుంటూ అంచనాలకే అందకుండా పాన్ ఇండియా మార్కెట్లో పవర్ చూపిస్తున్నాడు. కేజిఎఫ్ 2 సాధించిన కలెక్షన్స్, రికార్డ్స్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం.
KGF2: దంగల్‌ను తొక్కేసిన కేజీయఫ్2.. బాలీవుడ్‌లో టాప్ రెండు మనవే!
కేజిఎఫ్ 2 కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది. ప్రతీ రోజూ ఏదో ఒక రికార్డును బద్ధలు కొడుతూ పాన్ ఇండియా మార్కెట్లో దూసుకెళ్తోంది. రాఖీభాయ్.. రామ్, భీమ్ లను అధిగమించాడు. ఒకవైపు ట్రిపుల్ ఆర్ గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేసి, మరో వైపు దంగల్ రికార్డును బ్రేక్ చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ 2 పొజిషన్ ఆక్రమించాడు. బాహుబలి 2 తర్వాత కేజిఎఫ్ 2ను ఓ యువరాజులా ఇండియన్ ఫిలిం సామ్రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెట్టారు యశ్ అండ్ ప్రశాంత్ నీల్.
KGF2: అఫీషియల్.. వెయ్యి కోట్ల క్లబ్‌లో కేజీయఫ్2
వరల్డ్ వైడ్ కేజిఎఫ్ 2 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 720 కోట్ల 31 లక్షలు, సెకెండ్ వీక్ 223.51 కోట్లు. కాగా రిలీజ్ అయిన 16 రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది కేజిఎఫ్ 2. ఇక 20 రోజుల్లోనే 1065. 52 కోట్ల కలెక్షన్స్ రాబట్టి, 1100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. కేజిఎఫ్2 హెందీ వెర్షన్ ఫస్ట్ డే 63 కోట్ల 66 లక్షల తో హిందీ సినిమా డే 1 కలెక్షన్స్ రికార్డును కొల్లగొట్టింది. ఇప్పుడు 391 కోట్ల వసూళ్లు సాధించి, బాహుబలి ది కన్ క్లూజన్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాగా నిలిచింది.
KGF2: డబ్బింగ్ సినిమాల్లో నైజాం నవాబుగా రాఖీ భాయ్!
కేజిఎఫ్ సీక్వెల్ గా ఈ ఇయర్ ఏప్రిల్ 14న వచ్చిన కేజిఎఫ్ 2 బాక్సాఫీస్ ముందు వరసగా మూడు వారాలపాటు అగ్రస్థానంలో నిలిచి, డ్రీమ్ రన్ తో దూసుకెళ్తోంది. కేజిఎఫ్ 2 హిందీ వెర్షన్ అమీర్ ఖాన్ సినిమా దంగల్ ఆల్ టైమ్ ఇండియా బిజ్ ను క్రాస్ చేసి, బాలీవుడ్ లోనూ నెం. 2 పొజిషన్ కొట్టేసింది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది. ఇంకా తెలుగు, తమిళ, కన్నడ అండ్ హిందీ నాలుగు భాషల్లో వంద కోట్ల గ్రాస్ వసూల్ చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీగా కేజిఎఫ్ 2 రికార్డ్ సెట్ చేసింది.
KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!
యాక్షన్ సీక్వెన్సెస్, మాసివ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ సౌత్ తో పాటూ నార్త్ ఆడియెన్స్ కోరుకుంటున్నట్టు కంప్లీట్ మాస్ పీరియాడికల్ డ్రామాగా కేజీఎఫ్2ను రెడీ చేశారు ప్రశాంత్ నీల్. వావ్ అనిపించే ఎలివేషన్స్ తో అట్రాక్ట్ చేశాడు రాఖీబాయ్. యశ్, ప్రశాంత్ నీల్ తమ మ్యాజిక్ తో బాహుబలి 2 తర్వాత, కేజిఎఫ్2 ని టాప్ పొజిషన్ లో నిలబెట్టారు. దాంతో కేజిఎఫ్ టీమ్ తో పాటు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
- RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
- OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
- Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
- RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
- RRR: ఆర్ఆర్ఆర్కు పోటీగా చిన్న సినిమా.. తట్టుకోగలదా..?
1IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
2Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
3IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
4Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!
5Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
6Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
7Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
8Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
9Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
10Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
-
Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం