Raviteja : ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పడనుందా??

ప్పటికే 'ఖిలాడీ' సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఖిలాడీ సినిమా వాయిదా పడనుంది అని తెలుస్తుంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో........

Raviteja : ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పడనుందా??

Khiladi

Khiladi :  రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘ఖిలాడి’. రమేష్ వర్మ డైరెక్షన్ లో కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ బాగా క్లిక్ అయ్యాయి. వాటికి మంచి ప్రజాదరణ లభిస్తుంది. సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఖిలాడీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది.

Tollywood : చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ కూడా.. జగన్‌ని కలవడానికి వెళ్తున్న స్టార్స్

అయితే ఇప్పటికే ‘ఖిలాడీ’ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఖిలాడీ సినిమా వాయిదా పడనుంది అని తెలుస్తుంది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ”ఈ సినిమాని నేను కూడా ఇంకా చూడలేదు. ఇంకా సినిమాకి RR వేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీని కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు. సినిమా 11న అని చెప్పాము. కానీ అప్పటికి పూర్తి అవుతుందో లేదో తెలీదు. మాములుగా కంటే ఎక్కువ టైం కష్టపడుతున్నారు మా టీం అంతా. ఫిబ్రవరి 18 డేట్ కూడా అనుకుంటున్నాము. కానీ 11న రావడానికే ట్రై చేస్తాము.” అని తెలిపారు. రవితేజ వ్యాఖ్యలతో ‘ఖిలాడీ’ సినిమా వాయిదా పడొచ్చు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.