నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. 

  • Published By: vamsi ,Published On : June 16, 2020 / 04:01 AM IST
నేను కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. 

నటుడు సుశాంత్ తన జీవితాన్ని మధ్యలో ముగించుకుని వెళ్లిపోవడాన్ని యావత్ సినీ పరిశ్రమ ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా.. లేటెస్ట్‌గా వెటరన్ హీరోయిన్, నటి ఖుష్బూ కూడా తన జీవితంలో ఎత్తుపల్లాలు గురించి ప్రస్తావించింది. 

ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు సీనియర్ నటి ఖుష్బూ వెల్లడించింది. డిప్రెషన్ అనే పదం ఒక మనిషి జీవితంలో చాలా కామన్. అయితే స్థాయిని బట్టి మనిషి విలువపై లెక్కలు వేసే ప్రపంచం పోకడను మనిషి కొన్నిసార్లు తట్టుకోలేకపోతున్నాడని ఆమె అన్నారు. అందుకే మనిషిలో పరాజయం అనే పదం భారంగా మారుతోంది. ఈ కాలంలో టీనేజ్ వయసులోనే ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని ఆమె అన్నారు.

టీనేజ్‌లో డిప్రెషన్ అనే పదం ఎంత కఠినంగా మరిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఎంతో మానసిక ఒత్తిడిని నా జీవితంలో చూశానని చెప్పిన ఆమె.. ప్రతి మనిషిలో అటువంటి ఆలోచన ఉంటుందని, మానసిక ఒత్తిడి అనేది లేదంటే.. వాళ్ళు అబద్ధం చెబుతున్నట్లు లెక్క అని అన్నారు.

నేను డిప్రెషన్‌కి గురైనప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. కానీ సమస్యలకు అది పరిష్కారం కాదని ధైర్యంగా మానసిక ఒత్తిడిలను తట్టుకొని పోరాడానని అన్నారు. ఆ సమయంలో నాకు నా స్నేహితులు దేవధూతల్లా కనిపించారని, నాకు ఎంతో సపోర్ట్ చేసి ధైర్యం నింపారని అన్నారు. అనంతరం సమస్యల కారణంగా విలువైన జీవితాన్ని వదులుకోవడం కరెక్ట్ కాదని అనిపించినట్లు చెప్పారు.